జనసేన పార్టీలోనే కాకుండా భీమవరంలో కుడా ఇపుడిదే మాట్లాడుకుంటున్నారు. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో  భీమవరంలో పవన్ కల్యాణ్ పోటీచేస్తారని ప్రచారం జరిగినన్ని రోజులు పట్టలేదు పోటీనుండి వెనకడుగు వేసినట్లు ప్రచారం మొదలవ్వటానికి. దానికి కారణం ఏమిటంటే టీడీపీ మాజీ ఎంఎల్ఏ పులపర్తి వీరాంజనేయులు మాటలే. ఈమధ్య పవన్ భీమవరంలోని టీడీపీ నేతల ఇంటికి వెళ్ళి మద్దతు అడిగిన విషయం అందరికీ తెలిసిందే. స్వయంగా పవనే వెళ్ళి మద్దతు అడగటంతో భీమవరంలో పవన్  పోటీచేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోయింది.





అయితే అదేసమయంలో మాజీ ఎంఎల్ఏ పులపర్తి వీరాంజనేయులు ఇంటికి కూడా వెళ్ళారట. పులపర్తితో మాట్లాడుతు భీమవరంలో తాను పోటీచేస్తానో లేదో తెలీదని చెప్పినట్లు మాజీ ఎంఎల్ఏ చెప్పారు. తనను పోటీచేయమని కూడా అడిగినట్లు చెప్పారు. భీమవరంలో తాను పోటీచేయటం కన్నా పవన్ పోటీచేస్తేనే బాగుంటుందని అన్నట్లుగా కూడా చెప్పారు. మరో రెండురోజుల్లో తాను జనసేనలో చేరబోతున్నట్లు పులపర్తి చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అందరిదగ్గరకు తిరిగి మద్దతు అడిగిన పవన్ సడెన్ గా పులపర్తిని పోటీచేయమని అడగటం ఏమిటి .





దీంతోనే పవన్ పోటీకి భయపడుతున్నట్లు అర్ధమవుతోంది. కారణం ఏమిటంటే వైసీపీ ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాసరావు చాలా గట్టి అభ్యర్ధి. ఆర్ధిక, అంగబలంలో పవన్ కన్నా ఎక్కువనే చెప్పాలి. గ్రంధికి కలిసొచ్చే అంశాలు ఏమిటంటే తాను కూడా కాపు సామాజికవర్గంలోని ప్రముఖుడే. అలాగే లోకల్ కూడా. గెలుపోటములతో సంబంధంలేకుండా గ్రంధి బీమవరంలోనే ఉంటారు.





అదే పవన్ విషయానికి వస్తే ఎవరికీ అందుబాటులో ఉండరు. సినిమా షూటింగుల్లో ఏరోజు ఎక్కడుంటారో కూడా తెలీదు. జనాలకు ఏమైనా సమస్య వస్తే పవన్ను కలవటానికి, మాట్లాడటానికి కూడా అవకాశంలేదు. ఎందుకంటే పవన్ ఎవరినీ కలవరు, ఎవరితోను మాట్లాడరు. పార్టీలో నేతలే పవన్ తో మాట్లాడాలంటే నానా అవస్తలు పడుతున్నారు. భీమవరంలో సర్వే చేయించుకుంటే నెగిటివ్ వచ్చిందట. అందుకనే గాజువాక, పిఠాపురంలో కొత్తగా సర్వే చేయించుకుంటున్నట్లు సమాచారం. జరుగుతున్నది చూస్తుంటే గంధ్రికి వ్యతిరేకంగా పోటీచేయటానికి పవన్  భయపడుతున్నట్లు ప్రచారం బాగా పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: