రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమేనా ? తాజాగా జీ న్యూస్ సర్వేలో తేలిన విషయం ఇదే. జీ న్యూస్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో 49.2 శాతం ఓట్ల షేరుతో 125 సీట్లలో గెలుపు ఖాయమని తేలింది. టీడీపీ, జనసేన కూటమికి 46.3 శాతం ఓట్లతో 50+సీట్లు సాధిస్తుందని తేలింది. బీజేపీ, కాంగ్రెస్ కు రాబోయే ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా రాదని అర్ధమైపోయింది.





ఇప్పటివరకు సర్వేచేసిన చాలా సంస్ధలు ఏపీ వరకు వైసీపీదే మళ్ళీ గెలుపని జోస్యం చెప్పాయి. కొన్ని సంస్ధలు లోక్ సభ సీట్లలో వైసీపీకి 23 లేదా 24 దాకా వస్తాయని తేల్చాయి. కొన్ని సర్వేలు 18 లేదా 19 సీట్లు ఖాయమని తేలింది. ఇండియా టు డే సంస్ధ తప్ప మిగిలిన సంస్ధల్లో చాలా సంస్ధలు చేసిన సర్వేల్లో వైసీపీదే విజయమని తేల్చాయి. ఇపుడు తాజాగా జీ న్యూస్ లో కూడా వైసీపీకి 19 లోక్ సభ సీట్లు ఖాయమని తేలింది. టీడీపీ, జనసేన కూటమికి ఆరు సీట్లు వస్తాయట.





19 లోక్ సభ సీట్లలో గెలుపు దామాషా ప్రకారం చూస్తే 133 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఖాయమవ్వాలి. అయితే సర్వేలో 125 నియోజకవర్గాల్లోనే గెలుస్తుందని చెప్పింది. అంటే 8 అసెంబ్లీ సీట్లను తక్కువగానే చూపించింది. వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని సర్వే ఎందుకు తేల్చినట్లు ? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పనితీరుపై 55 శాతంమంది జనాలు సంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తేలింది.





ఇదే సమయంలో జగన్ పనితీరు బాగోలేదని 38 శాతంమంది జనాలు అభిప్రాయపడ్డారు. అలాగే పర్వాలేదన్నట్లుగా 7 శాతంమంది జనాలు అభిప్రాయంతో ఉన్నారట. అంటే 55 శాతంమంది సంతృప్తిగా ఉన్న జనాలు+7 పర్వాలేదని అభిప్రాయపడుతున్న జనాల శాతం మొత్తం కలిపితే 62 శాతం జనాలని లెక్కతేలింది. తాజా సర్వే టీడీపీ, జనసేన కలిస్తే మాత్రమే. ఇదే కూటమితో బీజేపీ కూడా కలిస్తే లెక్కలు మారిపోతాయి. అప్పుడు సర్వే ఫలితాల్లో తేడా వచ్చేస్తుందని తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: