ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు రసావతరంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక ఓటరు మహాశయులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా అస్త్రాలను సంధిస్తూ ఉన్నాయి. హామీల మీద హామీలు ఇస్తూ అందరిని తమ వైపుకు తిప్పుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంలో బిజీబిజీగా ఉన్నాయి అని చెప్పాలి. కాగా ఒకప్పుడు కేవలం రాజకీయాలలో రాజకీయపరంగా మాత్రమే విమర్శలు ఉండేవి. కానీ ఇటీవల కాలంలో పర్సనల్ లైఫ్ ని కూడా ఇలాంటి విమర్శల కోసం వాడుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఆ పార్టీపార్టీ అనే తేడా లేదు అన్ని పార్టీలకు కూడా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు అధికార వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగత విషయాలను టార్గెట్ గా చేసి విమర్శలు చేయడం చేస్తూ ఉంటే.. ఇక మరోవైపు అటు పవన్ సహా మరోవైపు టిడిపి పార్టీ కూడా జగన్ ఫై ఇలాంటి విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవల వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేశారు. గతంలో టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ మరణాన్ని తెరమీదకు తెచ్చి ఏకంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు నందిగాం సురేష్. ఈ క్రమంలోనే ఆయన చేసిన విమర్శలు కాస్త ప్రస్తుతం సంచలనగా మారిపోయాయి అని చెప్పాలి  ఏకంగా హీరో ఉదయ్ కిరణ్ చావుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణం అంటూ ఎంపీ నందిగాం సురేష్ ఆరోపించారు.


ఉదయ్ కిరణ్ మృతి పై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఏకంగా అతనిపై కక్ష పెట్టుకుని ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకుండా చేసింది పవన్ కళ్యాణ్. ఇక దీంతో తీవ్ర ఒత్తిడి కారణంగా చివరికి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఎంపీ నందిగం సురేష్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇక జనసైనికులు చెమటను పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబుకు అమ్ముకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించాడు నందిగాం సురేష్. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీ కారణంగానే ఉదయ్ కిరణ్ కెరియర్  పాడైందని.. తద్వారా  అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని ఒక టాకీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండగా.. ఇక ఇప్పుడు నందిగాం సురేష్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: