రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని గెలిపించటానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే)రంగంలోకి దిగారా ? అవుననే అనిపిస్తోంది అందరికీ. ఎందుకంటే తాజాగా పీకే ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఒక మీడియా నిర్వహించిన మీటింగులో పీకే మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవదని చెప్పారు. వైసీపీ   గెలవదని ఆయనకు ఎలాగ తెలుసు అన్నది పెద్ద ప్రశ్న. అసలు అసంబద్ధంగా వైసీపీ గెలవదని పీకే ఎలా చెప్పగలిగారు ? ఎందుకు చెప్పారు ?





పీకే ఏమంటారంటే సంక్షేమపథకాలు అమలుచేసినంత మాత్రాన జనాలు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయరట. జనాలు అభివృద్ధిని చూసే ఓట్లేస్తారని పీకే చెప్పారు. నిజానికి అభివృద్ధిని చూసి ఓట్లేసంత ప్రోగ్రెసివ్ కాదు మన ఓటర్లు. ఊరు అభివృద్ధిని, జిల్లా, రాష్ట్రం అభివృద్ధిని చూసి ఓట్లేసే జనాలు మనదగ్గర ఎక్కువుండరు. ఓటర్లలో మెజారిటి జనాలు తమకేమివచ్చిందనే చూసుకుంటారు. నిజంగానే ప్రజల్లో అభివృద్ధిని చూసి ఓట్లేసేంత చైతన్యమే ఉండుంటే పాలకుల్లో ఇంతమంది అవినీతిపరులుండేవారు కాదు. అసలు ఓట్లేయటానికి పోలింగ్ కేంద్రాలకు ఎంతమంది వస్తున్నారన్నది పెద్ద ప్రశ్న.





కాబట్టి జనాలు ఏమిచూసి ఓట్లేస్తారన్నది ఎవరు కచ్చితంగా చెప్పలేరు. జగన్ కు ఓట్లేయరు సరే మరి ఎవరికి వేస్తారు ? చంద్రబాబునాయుడుకు వేస్తారా ? 2014-19 మధ్య చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏముంది ? అభివృద్ధీ చేయలేదు, సంక్షేమపథకాలూ అమలుచేయలేదు. అయినా జగన్ను కాదని చంద్రబాబుకు ఓట్లేసి గెలిపిస్తారని పీకే ఉద్దేశ్యమా ? తన అసంబద్ధమైన వ్యాఖ్యలతో చంద్రబాబు తరపున జనాల మైండ్ సెట్ మార్చటానికి పీకే ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.





జగన్ హయాంలో అభివృద్ధి జరగాల్సినంత జరగలేదన్నది వాస్తవమే. అయితే అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయటానికి ఖజనాలో ఉన్న నిధులెన్ని అన్నది కూడా చూడాలి. జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికి ఖజనాలో ఉన్నది కేవలం 100 అంటే 100 కోట్ల రూపాయలు  మాత్రమే. ఈ విషయాన్ని చంద్రబాబు,యనమల రామకృష్ణుడు చాలాసార్లు చెప్పారు. పైగా ఐదేళ్ళల్లో రెండు సంవత్సరాలు కరోనాతోనే సరిపోయింది. అయితే ఉన్న ఆదాయంతో, అప్పులతో వందశాతం సంక్షేమ కార్యక్రమాలనైతే అమలుచేస్తున్నారు. కాబట్టి రేపటి ఎన్నికల్లో జనాలు ఓట్లెవరికి వేస్తారన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: