ఇపుడిదే ప్రశ్నకు ఎవరికి మద్దతుగా వాళ్ళు సమాధానం చెప్పుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే వైసీపీ నుండి ఎవరు టీడీపీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నా, వెళుతున్నా వెంటనే ఎల్లోమీడియా జగన్మోహన్ రెడ్డికి షాక్ అంటు నానా రచ్చ చేస్తోంది. టీడీపీ నుండి వైసీపీలోకి ఎవరైనా వచ్చినా అసలా వార్తను కనబడకుండా ఉద్దేశ్యపూర్వకంగానే  వదిలేస్తోంది. అయితే ఇక్కడ అసలైన పాయింట్ ఏమిటంటే వైసీపీ నుండి టీడీపీలోకి వెళుతున్న వారివల్ల నిజంగానే జగన్ కు షాక్ తప్పదా ? అని.

ఇక్కడే వైసీపీ నేతలు చూస్తున్న కోణానికి ఎల్లోమీడియా, చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలు, రాతలకు పూర్తి విరుద్ధంగా ఉంది. వైసీపీ నుండి ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయులతో పాటు ఎంఎల్ఏలు వసంత కృష్ణప్రసాద్, కొలుసు పార్ధసారధి టీడీపీలో చేరారు. చంద్రబాబు మాట్లాడుతు జగన్ ఇచ్చిన టికెట్లు వద్దని చెప్పి ఎంపీలు టీడీపీలో చేరుతున్నారన్నారు.  ఎంఎల్ఏలు కూడా జగన్ కు దణ్ణంపెట్టేసి టికెట్లు వద్దని చెప్పి టీడీపీలోకి వచ్చేస్తున్నారని అన్నారు.

వైసీపీలో జరుగుతున్నదానికి ఎల్లోమీడియాలో వస్తున్నదానికి పూర్తి విరుద్ధమని అందరికీ తెలుసు. పైన చెప్పిన ఎంపీలు, ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వటానికి జగన్ నిరాకరించారు. వైసీపీలో టికెట్లు వచ్చే అవకాశంలేదని తేలిపోయిన తర్వాతే వాళ్ళంతా చంద్రబాబుతో మాట్లాడుకుని టీడీపీలో చేరారు. అదే జగన్ గనుక టికెట్లు ఇచ్చుంటే పైన చెప్పిన వాళ్ళెవరు టీడీపీలో చేరుండేవారే కాదు. వీళ్ళకు టికెట్లిచ్చినా గెలిచే అవకాశంలేదని సర్వేల్లో తేలిన తర్వాతే జగన్ వాళ్ళని వద్దనుకున్నారు. జగన్ వద్దనుకున్న వాళ్ళు టీడీపీలో చేరితే అది వైసీపీకి షాక్ ఎలాగవుతుంది ?

జగన్ వద్దనుకున్నవాళ్ళందరు  టీడీపీలో చేరి టికెట్లు తీసుకుని గెలిస్తే అప్పుడు షాక్ అని రాసినా అర్ధముంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీద పోటీచేస్తున్న వాళ్ళలో ఎంతమంది గెలుస్తారో తెలీదు, ఎంతమంది ఓడుతారో తెలీదు. గెలిస్తే జగన్ కు షాక్ లేకపోతే చంద్రబాబునాయుడుకి పెద్ద షాక్. వీళ్ళ ఓటమి చంద్రబాబుకే కాదు పవన్ కల్యాణ్, ఎల్లోమీడియాకు కూడా షాకనే చెప్పాలి. ఎందుకంటే ఇపుడు ఆకాశమేహద్దుగా అంతలా ఓవర్ యాక్షన్ చేస్తున్నందుకు.

మరింత సమాచారం తెలుసుకోండి: