2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రాలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి సిద్ధం పేరుతో సమర శంకరాన్ని కూడా పూరించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విశాఖపట్నం జిల్లా భీమిలిలో మొదట సభను ప్రారంభించారు.. ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచిన వైసిపి పార్టీ నీ ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒకటవుతున్నాయి.. ముఖ్యంగా జనసేన టిడిపి పార్టీ పొత్తు పెట్టుకుని ఈసారి ఎన్నికలలో పాల్గొనబోతున్నారు. అంతేకాకుండా జెండా అనే పేరుతో ఇటీవలే ఎన్నికల ప్రచార సభను కూడా మొదలుపెట్టారు.


ఇప్పటివరకు ఇండియా టీవీ, పోల్స్ట్రాటజీ, పొలిటికల్ క్రెడిట్, జి న్యూస్ ఇతరత్న సంస్థలు కూడా తమ అంచనాలను సైతం సర్వేల రూపంలో బయటపెట్టారు.. అన్ని సర్వేలు కూడా ఎక్కువగా వైఎస్ఆర్సిపినే అధికారం  చేపడుతుందని తెలియజేశాయి.. అయితే ఇప్పుడు తాజాగా ఒపీనియన్ నివేదికను ఇండియా టీవీ సిఎన్ఎక్స్ తెలియజేసింది.. దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు కేరళ ఇతరత్న లోక్సభ నియోజకవర్గాలలో ఒపీనియన్ పోలిని కూడా నిర్వహించింది ఈ సమస్త..


ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ సంఖ్యలో లోక్సభ స్థానాలు గెలుచుకుంటాయి అనే విషయం పైన కూడా తెలియజేశారు. దీని ప్రకారం చూస్తే ఆంధ్రాలో వైఎస్ఆర్సిపి పార్టీని మళ్ళీ హవా కొనసాగిస్తుంది.. 25 లోక్సభ స్థానాలు ఉండగా వైఎస్ఆర్సిపి 15 నుంచి 18 చోట్ల విజయకేతన్ ఎగరేస్తుందట.. తెలుగుదేశం పార్టీ ఏడు నుంచి పది స్థానాలకే పరిమితమవుతుందంటూ వెల్లడించారు.. ఒకవేళ దీని ప్రకారం చూస్తే అసెంబ్లీ బరిలో ఖచ్చితంగా 118 నుంచి 138 స్థానాలు వైయస్ఆర్సీపీ కచ్చితంగా గెలుస్తుందని చెప్పవచ్చు.. కర్ణాటక లోక్సభలో బిజెపి దక్కించుకుంటుందని.. అక్కడ బిజెపికి 22 స్థానాలు కాంగ్రెస్కి 4, జనాతదల్ -2 .. కేరళలో మొత్తం 20 లోకసభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ యుడిఎఫ్-11, ఎల్ డి ఎఫ్-6, బిజెపి మూడు చోట్ల గెలుపు.. తమిళనాడులో డిఎంకె-20, కాంగ్రెస్ -6, బిజెపి-5, ఏఐఏడీఎంకే-5 ,ఇతరులు-5 చోట్ల గెలుస్తాయని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: