ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలకు పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి సభ సక్సెస్‌ కావడంతో అదే ఊపులో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ రోజు జయహో బీసీ సభ నిర్వహించనున్నారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించే జయహో బీసీ సభ ఏర్పాట్లను ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించడం జరిగింది.ఈ సభకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హాజరు కాబోతున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన 19 మంది నేతల కమిటీ తయారుచేసిన ఉమ్మడి బీసీ డిక్లరేషన్‌ను మంగళగిరి సభలో రిలీజ్ చేస్తారు. బీసీలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా ఇంకా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్‌ తయారుచేశామని రెండు పార్టీల నేతలు అంటున్నారు.


అధికారంలోకి వస్తే బీసీల కోసం అమలు చేయబోయే పథకాలను ఆ సభలో వివరిస్తారు. 3 లక్షల మంది కార్యకర్తలు ఇంకా అభిమానులు తరలివస్తారని పార్టీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్‌ స్థాపించిన నాటి నుంచి నేటి దాకా తెలుగు దేశం బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తోందన్నారు అచ్చెన్నాయుడు.ఇక ఇప్పటికే తెలుగు దేశం పార్టీ సూపర్‌ సిక్స్‌లో బీసీ రక్షణ చట్టానికి హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వస్తే బీసీ కులగణనకు హామీ ఇచ్చే ఛాన్స్ ఉందని మంగళగిరి సభలో ప్రకటించే అవకాశముంది. అలాగే మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే కులగణన ప్రక్రియలో ఉంది. దీంతో నేటి సభలో టీడీపీ-జనసేన పార్టీలు బీసీ డిక్లరేషన్‌లో బీసీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. వైసీపీకి ధీటుగా బీసీలకు పథకాలు ప్రకటించే ఛాన్స్ ఉందని టీడీపీ-జనసేన పార్టీల వర్గాలు అంటున్నాయి. అయితే ఆ పార్టీలన్నీ కూడా బీసీ మంత్రం జపిస్తున్న తరుణంలో టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్‌లో ఎలాంటి అంశాలు ఉంటాయనే దానిపై బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: