పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం లో తిరుగు లేని పార్టీ గా కొనసాగిన "టి ఆర్ ఎస్" పార్టీ కొంత కాలం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఒక్క సారిగా ఈ పార్టీకి ఓటమి రావడంతో చాలా మంది సీనియర్ నాయకులు ఈ పార్టీని వదిలి పక్క పార్టీకి వెళుతున్నారు. అలాగే చిన్న స్థాయి నాయకులు , కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

ఇక మరికొన్ని రోజుల్లోనే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండడం సీనియర్ నాయకులు పార్టీని వదిలి వెళుతూ ఉండడంతో "కే టీ ఆర్" స్వయంగా రంగం లోకి దిగాడు. అందులో భాగంగా తాజాగా తెలంగాణ భవన్‌లో జరిగిన చేవెళ్ల పార్ల‌మెంట్ నియోజ కవర్గ విస్తృత స్థాయి స‌మావేశంలో "బీ ఆర్ ఎస్" వర్కింగ్ ప్రెసిడెంట్ "కే టీ ఆర్" పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా మాట్లాడిన "కే టీ ఆర్" ప్రస్తుత ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రజలకు ఎంతో ద్రోహం చేస్తుంది  అని చెప్పుకొచ్చాడు.

తాజా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ... అధికారం లోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ , రూ. 4000 పించన్లు , 2500 మహిళలకు , అందరికీ ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు వాటి ప్రస్తావనే లేదు. అలాగే ఆరు గ్యారంటీలను ప్రకటించారు. అవి పోయాయి. ఆరు గారఢీలు మాత్రమే మిగిలాయి. రాష్ట్రంలో ఏ వర్గం వారు ఈ రోజు కాంగ్రెస్ పాలన లోకి వచ్చాక సంతోషంగా ఉన్నారో చెప్పాలి.

ఎలక్షన్ల సమయంలో మేము అధికారం లోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తాం అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఎలక్షన్లు అయ్యాయి... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా చాలా కాలం అవుతుంది. ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాలు లేవు. ఖచ్చితంగా త్వరగా రెండు లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయవలసిందే అని కేటీఆర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: