ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ రాజకీయాలు రాను రాను ఉత్కంఠను రేపుతున్నాయి.నేడు టిడిపి అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలి లో ప్రజాగళం సభ లో మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వం అని ఇక్కడ ప్రజా ప్రభుత్వం అయినా టీడీపీ అని దాన్ని ప్రజల ఉత్సాహం చూస్తుంటే తెలుస్తుందని అన్నారు.ఈ ఎన్నికల్లో వైసిపికి డిపాజిట్లు రావడం కూడా చాలా కష్టం అని అన్నారు.నెల్లూరు లోక్ సభ స్థానం కోసం టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా ఈ ప్రజగళం సభకు హాజరయ్యారు.
ఈ కావాలి సభలో చంద్రబాబు నేడు టిడిపి 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ గూర్చి మాట్లాడారు.ఇన్నేళ్ల పార్టీ చరిత్ర లో జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగానే కాకుండా, ప్రభుత్వాల ఏర్పాటుతో ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి అన్ని ధరలు పెంచేశాడని,ప్రజల ఆదాయం అనేది తగ్గి కంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి.అలాగే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పడిపోయాయి. యువతను నట్టేట ముంచేసి ఆంధ్రప్రదేశ్ ను నిరుద్యోగాంధ్రప్రదేశ్ గా మార్చేసాడని అన్నారు.అయితే జాబ్ రావాలంటే మాత్రం బాబు రావాలని అన్నారు.ఈ ఐదేళ్ల లో రాక్షస పాలనా ప్రజలు అనుభవించారని ఇపుడు దాని నుండి విముక్తి కలిగే సమయం వచ్చిందన్నారు.ఆ విషయాలన్ని ప్రజలకు చెప్పడానికి, గుర్తుచేయడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు.ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం నా బాధ్యత అని సభాముఖంగా చెప్పడానికి వచ్చానన్నారు.
ప్రస్తుతం జగన్ పై ఉన్న ప్రజా వ్యతిరేకత అనేది ఒక తుపాను మాదిరిగా వీస్తుందని ఈ తుపాను ధాటికి ఫ్యాను రెక్కలు విరిగి  కొట్టుకుంటుందని వ్యాఖ్యనించారు. అయితే చివరికి ఆ ఫ్యాను అనేది డస్ట్ బిన్ లో చేరుతుందని ఇక జగన్ పతనం ఖాయం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: