తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా పేరుపొందిన నిఖిల్ సిద్ధార్థ్.. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీలో చేరినట్టుగా తెలుస్తోంది.. ఇండియన్ హెరాల్డ్ కు అందోస్తున్న సమాచారం ప్రకారం.. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిఖిల్ కి కండువా కప్పి మరి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది.అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా నిఖిల్ రాజకీయాల్లోకి రాబోతున్నారని ప్రచారం అయితే ఎక్కువగా వినిపించింది. ఈ విషయంపైన ఎక్కడ స్పందించలేదు నిఖిల్.


ఇండియన్ హెరాల్డ్ కు వచ్చిన సోర్స్ మేరకు.. నిఖిల్ సడన్గా రాజకీయాల్లోకి వచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేయాలని చూసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని ఈ నేపథ్యంలోని నిఖిల్ టిడిపిలో చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది. అయితే నిఖిల్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తారా లేదా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించింది టిడిపి. ఇండియన్ హెరాల్డ్ అంచనా మేరకు.. నిఖిల్ కేవలం టిడిపి తరఫున ఏపీలో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి టిడిపి పార్టీ నిఖిల్ కు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి మరి.



దాదాపుగా పదహారేళ్ల క్రితం హ్యాపీడేస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్నారు. ఆ తర్వాత స్వామిరారా ,కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా , కార్తికేయ-2 వంటి చిత్రాలతో మంచి క్రేజ్ అందుకున్నారు. దీంతో ఇటీవలే పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇండియన్ హెరాల్డ్ అందిస్తోన్న సమాచారం మేరకు.. నిఖిల్ రాష్ట్రమంతా తిరిగి టిడిపి తరఫున ప్రచారం చేసిన గెలిచే అవకాశాలు ఉండవని.. కేవలం మంచి చేస్తేనే ప్రజలు ఓటు వేస్తారంటూ పలువురు నాయకులు సైతం తెలుపుతున్నారు.. మరి నిఖిల్ ప్రచారం ఏ మేరకు టిడిపి పార్టీకి కలిసొస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: