బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఆ పార్టీలో క్రియాశీలక పాత్రను పోషిస్తున్న హరీష్ రావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన బీఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత నుండి 10 సంవత్సరాల పాటు అందులో మంత్రిగా పని చేశారు. ఇకపోతే పోయిన ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ తక్కువ సీట్లను తెచ్చుకోవడంతో ప్రస్తుతం ఈ పార్టీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతుంది.

ఇక హరీష్ రావు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నాడు. అందులో భాగంగా ఈయన ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారంటిలా విషయంలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇకపోతే తాజాగా హరీష్ రావు ఓ సమావేశంలో పాల్గొన్నారు. అందులో భాగంగా తాజాగా హరీష్ రావు మరోసారి కాంగ్రెస్ పాలనను తనదైన శైలిలో విమర్శించాడు.

హరీష్ రావు తాజాగా మాట్లాడుతూ ... ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. వాటిని జనాలు నమ్మలేదు. దానితో కొంత మంది కాంగ్రెస్ లీడర్లు కచ్చితంగా నెరవేరుస్తాం అని బాండ్లను కూడా రాసి ఇచ్చారు. అయినప్పటికీ జనాలు నమ్మలేదు. దానితో మీరు సోనియాను నమ్మండి ... రాహుల్ గాంధీని నమ్మండి అని ప్రచారాలు చేసింది. ఇక అదే సమయంలో మేము అధికారం లోకి వచ్చాక మొదటి అసెంబ్లీ సమావేశం లోపే 6 గ్యారెంటీలను అమలు పరుస్తాం అని కాంగ్రెస్ పార్టీ వారు చెప్పుకొచ్చారు.

ఇక ఇప్పటికే మూడు అసెంబ్లీ సమావేశాలు అయ్యాయి. ఇప్పటికి ఆరు గ్యారెంటీ ల విషయంలో ప్రజలకు ఏ సేవలు అందడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి 100 రోజులు పూర్తి అవుతుంది. ఇప్పటి వరకు చెప్పిన ఏ హామీని నెరవేర్చలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 హామీలను నెరవేర్చే వరకు నేను ఊరుకోను. ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రజలకు న్యాయం చేకూరే వరకు నేను పోరాడు ఉంటాను అని హరీష్ రావు తాజా సమావేశంలో చెప్పకచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: