ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని కొన్ని సర్వేలు చెబుతుండగా టీడీపీ ఓడిపోతుందని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరి వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే ప్రశ్నకు ఆసక్తికర జవాబు వినిపిస్తోంది. వైసీపీకి 95 నియోజకవర్గాల్లో అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని టీడీపీకి 80 నియోజకవర్గాల్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది.
 
ఎన్నికల సమయానికి మారిన పరిస్థితుల ఆధారంగా సీట్లలో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే వైసీపీ మాత్రం రాష్ట్రంలో వార్ వన్ సైడ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రైతులకు లేదా మహిళలకు పార్టీ అధికారంలోకి వస్తే ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలిగేలా ఒకే విడతలో ఎక్కువ మొత్తంలో ప్రయోజనం చేకూరేలా వైసీపీ భారీ హామీని ప్రకటించనుందని పొలిటికల్ వర్గాల టాక్.
 
ఇప్పుడే హామీని ప్రకటిస్తే టీడీపీ బీజేపీ జనసేన కూటమి నుంచి సైతం అదే తరహా హామీ వస్తుందని భావించి వీలైనంత ఆలస్యంగా హామీలను ప్రకటించాలని జగన్ ఫిక్స్ అయ్యారట. కూటమి నేతల మైండ్ బ్లాంక్ అయ్యేలా భారీ మొత్తంలో అప్పు మాఫీ చేసేలా ప్రకటన రానుందని భోగట్టా. హామీ ఇస్తే జగన్ కచ్చితంగా అమలు చేస్తారని ప్రజల్లో భావన ఉంది. ఆ భావనే వైసీపీని విజయతీరాలకు చేరుస్తుందని జగన్ బలంగా నమ్ముతున్నారు.
 
ఆ ఒక్క హామీతో ఏపీలో పొలిటికల్ లెక్కలు మార్చేయాలని కనీసం 120 స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు మరింత దగ్గరవ్వాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. వైసీపీని మించి పథకాలు అమలు చేస్తామని టీడీపీ చెబుతున్నా ప్రజలు మాత్రం టీడీపీని నమ్మట్లేదు. కూటమి అధికారం సాధించినా చంద్రబాబు  చివరి ఏడాది మాత్రమే పథకాలను అమలు చేసే ఛాన్స్ ఉందని వైసీపీ అభిమానులు సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో అధికారం సాధించే ఛాన్స్ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: