ఏపీలో అధికారం కోసం చంద్రబాబు ఇస్తున్న సంచలన హామీల గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పింఛన్ ఇస్తానని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల నుంచి ఆ పథకాన్ని అమలు చేస్తానని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జులై నెల పింఛన్ 4,000 రూపాయలకు అదనంగా మరో 3,000 రూపాయలు ఇస్తానని బాబు హామీ ఇచ్చారు.
 
ఏప్రిల్, మే, జూన్ నెలలలో తీసుకునే 3,000 రూపాయల పెన్షన్ కు అదనంగా నెలకు 1,000 రూపాయల చొప్పున జులైలో పింఛన్ ఇస్తానని బాబు ప్రకటించారు. ఇదే సమయంలో ఆక్వా రైతులకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆక్వా రైతులకు జోన్ తో నిమిత్తం లేకుండా రూపాయిన్నరకే విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ గురించి విని షాకవ్వడం ఆక్వా రైతుల వంతవుతోంది.
 
వైసీపీ ఇప్పటికే ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న  రైతులకు రూపాయిన్నరకే సబ్సిడీతో విద్యుత్ అందజేస్తోంది. రాష్ట్రంలో ఐదు ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న రైతుల సంఖ్య చాలా తక్కువేనని చెప్పవచ్చు. రూపాయిన్నరకే విద్యుత్ అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ వల్ల ఆక్వా రైతులకు కలిగే ప్రయోజనం శూన్యమని చెప్పవచ్చు. అమలులో ఉన్న హామీని కొత్త హామీలా చంద్రబాబు ప్రకటన చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
ఆక్వా రైతులకు మరింత ఎక్కువ బెనిఫిట్ కలిగేలా చంద్రబాబు హామీలు ఇచ్చి ఉంటే బాగుండేది. మరోవైపు రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉందని టీడీపీ అధికారంలోకి వచ్చినా వైసీపీ అధికారంలోకి వచ్చినా ఇచ్చినా హామీలను అమలు చేయడం సులువు కాదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఏపీ అప్పులను తగ్గించేలా ఏ రాజకీయ పార్టీ కృషి చేయడం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు, జగన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: