కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వీరభద్ర గౌడ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి విరూపాక్షి పోటీ చేస్తున్నారు. గుమ్మనూరు జయరాం ఆలూరు నుంచి పోటీ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆయనకు వైసీపీ టికెట్ కేటాయించలేదు. కర్నూలు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసే ఆఫర్ వచ్చినా ఆ ఆఫర్ ను గుమ్మనూరు జయరాం సున్నితంగా తిరస్కరించడం జరిగింది. టీడీపీలో చేరిన ఆయన గుంతకల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు.
 
విరూపాక్షి వర్సెస్ వీరభద్ర గౌడ పోటీలో ప్రస్తుతానికి విరూపాక్షి గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. విరూపాక్షి ఇంటింటికీ ప్రచారం చేస్తూ పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది. 2011లో విరూపాక్షి వైసీపీలో చేరి పార్టీ సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. వీరభద్ర గౌడ విషయానికి వస్తే 2014లో ఆలూరు నుంచి పోటీ చేసి వీరభద్ర గౌడ ఓటమిపాలయ్యారు.
 
ఆలూరులో బోయ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండగా విరూపాక్షి బోయ సామాజికవర్గానికి చెందిన నేత కావడం గమనార్హం. ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా తనకే వస్తాయని ఆయన భావిస్తున్నట్టు భోగట్టా. ఆలూరులో పోటాపోటీ ఉండనుందని వీరభద్ర గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సైతం 35,000 మంది ఉన్నారని సమాచారం అందుతోంది. ఆలూరు టీడీపీ ఖాతాలో చేరుతుందని వీరభద్ర గౌడ చెబుతున్నారు.
 
ఆలూరు నియోజకవర్గంలో గెలుపు కోసం ఇద్దరు నేతలు ఎంతో కష్టపడుతూ నియోజకవర్గంలో పరిస్థితులను మార్చేస్తున్నారు. 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకి సానుకూల పరిస్థితులు ఉంటాయో చూడాల్సి ఉంది. కర్నూలు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఆలూరు నియోజకవర్గం ఉంది. ఈ ఇద్దరు నేతలు ఆర్థికంగా కూడా బలమైన నేతలే అని తెలుస్తోంది. ఎవరు గెలిచినా ఆలూరు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే చాలని గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని స్థానికులు చెబుతున్నారు.అభ్యర్థిని మార్చడమే వైసీపీకి ప్లస్ కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: