ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికల్లో నెల్లూరులోని 10 స్థానాలలో వైసీపీ విజయం సాధించింది. ఐదేళ్లలో పరిస్థితులు కొంతమేర మారినా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ వైసీపీకి కొన్ని స్థానాల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని జగన్ భావిస్తున్నా పరిస్థితులు మాత్రం పూర్తిస్థాయిలో అనుకూలంగా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
నెల్లూరు సిటీలో టీడీపీ నుంచి పొంగూరు నారాయణ వైసీపీ నుంచి ఎండీ ఖలీల్ అహ్మద్ పోటీ చేస్తుండగా ఇక్కడ టీడీపీకే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వేమిరెడ్డి దంపతులు వైసీపీకి దూరమై టీడీపీలో చేరడం, నారాయణకు గట్టి పోటీ ఇచ్చే విషయంలో ఖలీల్ ఫెయిల్ అవుతుండటంతో నెల్లూరు సిటీకి నారాయణ ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ ఉందని ఇక్కడి ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.
 
నెల్లూరు రూరల్ లో టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో మరోమారు విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తానని శ్రీధర్ రెడ్డి కాన్ఫిడెన్స్ తో ఉండగా సర్వేల ఫలితాలు తనకే అనుకూలంగా ఉన్నాయని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఫీలవుతున్నారు. ఇక్కడ వైసీపీనే విజయం సాధించవచ్చని తెలుస్తోంది.
 
గూడూరులో టీడీపీ నుంచి పాశం సునీల్ కుమార్, వైసీపీ నుంచి మేరిగ మురళీధర్ పోటీ చేస్తుండగా టౌన్ లో వైసీపీపై వ్యతిరేకత ఉన్నా మండలాల్లో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
 
సర్వేపల్లిలో టీడీపీ నుంచి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తుండగా ఇక్కడ వార్ వన్ సైడ్ అని కాకాణి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సర్వేపల్లి నుంచి  ఓటమిపాలైన సోమిరెడ్డికి మరోసారి అదే ఫలితం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.
 
సూళ్లూరుపేటలో టీడీపీ నుంచి డాక్టర్ విజయశ్రీ బరిలో ఉండగా వైసీపీ నుంచి కిలివేటి సంజీవయ్యకు ఛాన్స్ దక్కింది. సూళ్లూరుపేటలో వైసీపీకే అనుకూల ఫలితాలు వస్తాయని తెలుస్తోంది. సంజీవయ్యపై వైసీపీ కార్యకర్తల్లో కొంత వ్యతిరేకత ఉన్నా జగన్ పై అభిమానంతో వాళ్లు కలిసికట్టుగా పని చేస్తున్నారని సమాచారం అందుతోంది.
 
వెంకటగిరిలో టీడీపీ తరపున లక్ష్మీ సాయి ప్రియ, వైసీపీ తరపున రామ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటుందని ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలుస్తారని తెలుస్తోంది.
 
కావలిలో టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తుండగా కావలిలో కూడా వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న చిన్నచిన్న తప్పులే కావలిలో వైసీపీని విజయతీరాలకు చేరుస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
కోవూరులో వైసీపీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రశాంతిరెడ్డి ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడంతో ఇక్కడ టీడీపీ గెలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
 
ఉదయగిరిలో టీడీపీ నుంచి కాకర్ల సురేష్ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉదయగిరిలో సైతం వైసీపీకే విజయావకాశాలు ఉన్నాయని ఓటర్ల అభిప్రాయాలను బట్టి అర్థమవుతోంది.
 
ఆత్మకూరులో వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి, టీడీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. మేకపాటి కుటుంబానికి స్థానికంగా ఉన్న గుర్తింపు వల్ల వైసీపీ విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: