ప్రస్తుతం ఏపీలో రాబోతున్న ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ప్రచార కార్యక్రమాలలో లీనం అయిపోయాయి.కడప జిల్లాలోని రాయచోటిలో టీడీపీకి షాక్ తగిలిందనే తెలుస్తుంది.పదేళ్లుగా పార్టీకి సేవ చేసిన టికెట్ రాకపోవడంతో పార్టీని వీడిపోతున్నారు మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి.పదేళ్లుగా పార్టీని నడిపిస్తున్న రమేష్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసారు.లక్కీరెడ్డి ఎమ్మెల్యే గా పనిచేసిన రమేష్ కుమార్ రెడ్డి తనని కాదని రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో కొంచం అసంతృప్తిగా ఉన్నారు.చంద్రబాబు పై టికెట్ అమ్ముకున్నారని ఆరోపణలు చేసిన రమేష్ కుమార్ రెడ్డి నేడు జగన్ సమక్షం లో వైసీపీ లో చేరనున్నారు.ఆయన తో పాటు పెద్ద సంఖ్య లో ఉన్న ఆయన అనుచరులు కూడా పార్టీకి రాజీనామా చేసారు.దాంతో టీడీపీకి ఇదొక పెద్ద ఎదురు దెబ్బ అని అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి ఒకప్పటి టీడీపీ కంచుకోట అయితే గత రెండు దశాబ్దాలుగా టీడీపీ నామమాత్రపు పార్టీగా మారింది.అయితే ఈసారి టికెట్ రమేష్ కు వస్తుంది అని అతని అనుచరులు అనుకున్నారు కానీ అనూహ్యంగా చంద్రబాబు రాంప్రసాద్ రెడ్డి కి ఇవ్వడం తో ఆ రోజే చంద్రబాబు దిష్టి బొమ్మ ను రమేష్ అనుచరులు కాల్చేశారు అది స్థానికంగా టీడీపీ పార్టీని రచ్చ రచ్చ చేసింది.అయితే టికెట్ ఇవ్వకపోయినా కనీసం పార్టీలో సముచిత స్థానం ఇస్తారనుకుంటే అదీలేకపోయేసరికి రమేష్ కూడా సైకిల్ దిగిపోయి ఫ్యాన్ కిందకు వెళ్లాలని డిసైడ్ ఐపోనట్లు సమాచారం. అయితే ఇలాంటి సంఘటన టీడీపీకి పెద్ద సమస్యగా మారింది.ఒకవైపు అదే కడప లో జగన్ ఓడిద్దామనుకొని షర్మిల మరియు సునీత ప్రచారం లో భాగంగా వివేకానంద హత్యకేసు హైలేట్ చేసి చెప్పడం కూడా చంద్రబాబు ప్లాన్ లో ఒక భాగమేనని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: