పోతిన మహేష్ లాంటి ఫైర్ బ్రాండ్ నేత జనసేనలో ఉండడం ఆ పార్టీకే రాజకీయ లాభం. అలాంటిది ఆయన్ని కోల్పోవడం జనసేనకి చాలా నష్టం. జనసేనపై మండిపడి రాజీనామా చేసిన పోతిన మహేష్ ఒంగోలు జిల్లాలోని గంట వారి పాలెం వెళ్లి మరీ వైసీపీలో చేరారు. ఆయనను జగన్ మోహన్ రెడ్డి కౌగలించుకుని మరీ భుజం తట్టారు. అసలు పోతిన మహేష్ అంటేనే ఫైర్ బ్రాండ్. ఆయన జనసేన పార్టీలో ఉన్నపుడు వైసీపీని పదునైన మాటలతో చీల్చిచెండాడారు. అలాంటి మహేష్ వైసీపీలో వెళ్లారు అంటే ఏమి హామీ పొంది ఉంటారు అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతుంది.అయితే ఆయన భవిష్యత్తుకు తాను హామీ అని జగన్ మోహన్ రెడ్డి చెప్పారని సమాచారం తెలుస్తుంది. మరోసారి వైసీపీ ప్రభుత్వం రాగానే పోతిన మహేష్ కి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంటున్నారు. అంటే ప్రస్తుతం పార్టీలు మారిన వారి చాలా మంది సీట్లు ఖాళీలు అవబోతున్నాయి. వాటిలో ఒక దానిని పోతిన మహేష్ కి ఇస్తారని సమాచారం తెలుస్తుంది. పోతిన మహేష్ ని పార్టీలోకి తీసుకున్నారు ఆయన వల్ల కూడా రాజకీయ లాభం ఉండాలి కదా అన్నది మరో చర్చ.


మరి ఆయనకు ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బిగ్ షాట్ సుజనా చౌదరిని ఖచ్చితంగా ఓడించాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ. అలాగే మైనారిటీలు కూడా ఎక్కువ. ఈ రెండూ కలిస్తే వైసీపీ విజయం ఖాయం అవుతుంది. పైగా ఇక్కడ టీడీపీ గెలిచింది కూడా ఎపుడూ లేదు. బీజేపీకి అసలు ఆశలు కూడా లేవు. ఇవన్నీ తీసుకునే పోతిన మహేష్ ని ఫ్యాన్ పార్టీలోకి ఆహ్వానించారని అంటున్నారు. ఆయన సుజనా చౌదరిని ఓడించే విషయంలో వైసీపీకి పూర్తి స్థాయిలో ఉపయోగపడితే కనుక కచ్చితంగా ఆయనకు వైసీపీలో మంచి స్థానం ఉంటుందని అంటున్నారు. అలా పోతిన మహేష్ ముందు ఒక భారీ ఆఫర్ తో పాటు ఒక బిగ్ టాస్క్ కూడా ఉంది.మరి విజయవాడ పశ్చిమలో ఏమి జరుగుతుందో చూడాలి. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఇదే నియోజకవర్గంలో చోటు చేసుకుంటుంది అని అంటున్నారు. తెలుగు దేశం పార్టీ నుంచి కూడా కీలక నేతలను ఆకట్టుకుని వైసీపీలో చేర్చుకుంటారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: