•ఆ సింపతే బండారు శ్రావణి విజయమా
•పార్టీ నాయకుల వ్యతిరేకత మధ్య వీరాంజనేయులు తట్టుకోగలరా
  జొన్నలగడ్డ పద్మావతి వల్ల ఒరిగిందేమీ లేదా


(శింగనమల - ఇండియా హెరాల్డ్)
శింగనమల నియోజకవర్గం అంటే రాజకీయాలకు ఒక సెంటిమెంటుగా మారిపోయింది. అధినేతలకి తలపోటు తెప్పించే విధంగా ఈ నియోజకవర్గం ఉంటుంది. అయితే ఈసారి ఎన్నికలలో ఇక్కడ టిడిపి మహిళా నేత బండారు శ్రావణి.. వైసిపి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు పోటీ పడుతున్నారు. మరి వీరిద్దరి యొక్క స్ట్రాటజీ ఏవిధంగా ఉందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


ముఖ్యంగా సీనియర్ నేత జొన్నలగడ్డ పద్మావతి ప్లాన్ ఏమిటి.. జగన్ వ్యూహం ఏమిటి.. చంద్రబాబు స్కెచ్ ఏమిటి అనే విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాలలో సింగనమల నియోజవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. ఎస్సీకి రిజర్వ్డ్ అయిన శింగనమల.. గెలిచిన పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందట..ఈ సెంటిమెంటు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోనే సింగనమల నియోజకవర్గం చాలా పెద్దది. ఇందులో ఆర్థికంగా బలపడిన ఎస్సి అభ్యర్థులు ఇక్కడ ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా అధికార , ప్రతిపక్ష పార్టీలకు ఈ స్థానం చాలా కీలకంగా ఉంటుందని చెబుతూ ఉంటారు.


ముఖ్యంగా జొన్నలగడ్డ పద్మావతి మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయకపోవడమే కాకుండా.. నియోజవర్గాలలో కూడా చాలా వ్యతిరేకత ఉండడంతో జగన్ ఈసారి ఈమెకు సీటు ఇవ్వడని కన్ఫామ్ అయిపోయింది.. ఈ సమయంలో గతంలో టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన యామిని బాల , బలపనూరు అశోక్ శ్రీనివాస్ వంటి వారు ఆశ పెట్టుకున్నప్పటికీ వీరందరినీ కాకుండా వీరాంజనేయులు అనే వ్యక్తికి జగన్ టికెట్ ఇచ్చారు.


అయితే అలా వీరాంజనేయులును అభ్యర్థిగా ప్రకటించడంతో వైసిపి క్యాడర్ వ్యతిరేకిస్తోంది. పైగా చంద్రబాబు వీరాంజనేయులు పేరును బయటకు తీయడంతో మరింత పాపులర్ అయ్యారు. సామాన్యులను కూడా వైసిపి ప్రభుత్వం నాయకులను చేస్తుందని నిరూపించారు.. కానీ ఈ విషయాలను మాత్రం వైసీపీ క్యాడర్ వ్యతిరేకిస్తూ..దీంతో చాలామంది నాయకులు మీటింగ్ సైతం ఏర్పాటు చేసుకొని అభ్యర్థిని మార్చాలని కోరుతున్నప్పటికీ.. దీంతో ఎన్నికలు జరిగే లోపు వైసీపీలో ఏమైనా జరగవచ్చు అనే పరిస్థితి ఏర్పడింది.

మరొకవైపు టిడిపి నుంచి సింగనమల అభ్యర్థిగా బండారు శ్రావణిని ఎంపిక చేశారు. వాస్తవానికి వైసీపీ పరిస్థితి కంటే టిడిపి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది.. 2019 సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలను పక్కనపెట్టి మరీ యంగ్ లీడర్ అంటూ బండారు శ్రావణి కి టికెట్ ఇచ్చారు. కానీ ఆ ఎన్నికలలో ఆమె ఓడిపోయింది. అయినప్పటికీ కూడా శ్రావణి ఎన్నో రకాల మీటింగులతో కార్యకర్తలను కలుస్తూ పలువురు కుటుంబ సభ్యులను పలకరిస్తూ ముందుకు వెళ్తోంది. అయితే బండారు శ్రావణి సీనియర్లను పక్కన పెట్టిందని.. వారితో విభేదాలు కొని మరి తెచ్చుకుంటుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో చాలామంది నాయకులు ఈమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట. మరి పార్టీ కోసం అందరి నాయకులు కలిసి బండారు శ్రావణిని గెలిపిస్తారో లేదో అనే సందేహం కార్యకర్తలలో ఉందట. మరోవైపు బండారు శ్రావణి కి టిడిపి జనసేన పొత్తుల భాగంగా 51 శాతం ఓటింగ్ కనిపిస్తోంది. అంతేకాదు గతంలో ఓడిపోయిందనే సింపతి కూడా బండారు శ్రావణి కి లభిస్తోంది.. మరోవైపు వైసిపి వీరాంజనేయులుకు 49% ఓటింగ్ కనిపిస్తోంది.. మొత్తానికి అయితే ఒక్క శాతం తేడాతో బండారు శ్రావణి పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరి రాబోయే రోజుల్లో ఇందులో ఏదైనా మార్పు జరగవచ్చేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: