తాజాగా మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ యువతకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందించింది. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ యువతకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పది జిల్లాల్లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయమని కేంద్రం ప్రభుత్వం బ్యాంకర్ ల కమిటీని ఆదేశించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 జిల్లాల్లో మాత్రమే ఈ ఉపాధి సంస్థలు ఉన్నాయి.

మిగతా పది జిల్లాల్లో కూడా ఈ శిక్షణ సంస్థలను ఈ నెల చివరి వరకు ఏర్పాటు చేయమని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ జిల్లాల లీడ్ బ్యాంకులకి స్పష్టం చేసింది. స్వయం ఉపాధి శిక్షణ సంస్థలకు సొంత భవనాల కోసం కనీసం ఎకరం స్థలం అవసరం ఈ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది అని ... నైపుణ్య శిక్షణ కోసం గ్రామీణ యువకులను సమీకరించినందుకు అవసరమైన పోర్టల్ , ప్రకటనలను జారీ చేయాలి అని అలాగే టీవీ లలో ప్రకటనలు నిర్వహించమని కమిటీ సూచించింది.

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పథకాలకి కింద రుణాలు పొంది స్వయం ఉపాధి చేసుకునే గ్రామీణ యువతకి ఆయా రంగంలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ శిక్షణ సంస్థలు ఎంతో దోహదపడతాయి అని ఈ కమిటీ చెప్పుకొచ్చింది. దేశ వ్యాప్తంగా 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల మంది కి శిక్షణ ఇవ్వాలి అని కేంద్రం నిర్దేశించింది.

లీడ్ బ్యాంకు స్కీం కింద అయా జిల్లాల గ్రామీణ యువతకి సూక్ష్మ పరిశ్రమకు అవసరం అయినా నైపుణ్య శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించాలని కేంద్రం సూచించింది. ఇక ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలలో గాను 16 సంస్థలు ఉన్నాయి. ఇకపై 26 జిల్లాలకు గాను 26 సంస్థలను స్థాపించబోతోంది. దీనిని కానీ సరిగ్గా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ యువత భవిష్యత్తు చాలా బాగుంటుంది అని కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పుకొస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: