ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో కర్నూలు లో టిడిపి పార్టీ టికెట్ల విషయంలో సమన్వయత వ్యవహరించని ఫలితంగా టిడిపి పార్టీకి తీరని నష్టం కలిగించేలా చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ పార్టీ కి గుడ్ బై చెప్పాలని కొంతమంది నాయకులు.. పార్టీ వీడకపోయినా సొంత పార్టీ అభ్యర్థులను ఓడిపోవాలని కోరుకునేవారు మరికొందరు ఉన్నట్లుగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలలో టిడిపి పార్టీ పరిస్థితి ఏంటో అటు అధిష్టానానికి నేతలకు కూడా అర్థం కాలేకపోతోంది.


కర్నూలు జిల్లాలోని చాలామంది నేతలు టిడిపి పార్టీకి ఒక్కొక్కరు గుడ్ బై చెప్పే ఆలోచనల నేతలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందుకు కారణం టికెట్ల కేటాయింపులో కొంతమంది నేతల తీరు చాలా అసంతృప్తి కలిగిస్తోంది. కేడర్ బలంగా ఉన్న నాయకత్వం లోటు కారణంగా దశాబ్దాలుగా బలహీన పడుతున్న టిడిపి పార్టీ జిల్లాలలో కాపాడేదెవరనే పరిస్థితి ఏర్పడింది. ఆశావాహులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సమన్వయం కోసం వచ్చిన నేతల కోసం వచ్చిన తీరును చూసి టిడిపిలోని ముఖ్య నేతలు గుడ్ బై చెప్పేందుకు కారణాలవుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలలోని కొన్ని నియోజకవర్గాలలో ఇలాంటి సమస్యల నుంచి బయటపడిన.. కొన్ని నియోజకవర్గాలలో మరింత దారుణమైన పరిస్థితి ఏర్పడిందని నాయకులు వాపోతున్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ .. ఆలూరు మంత్రాలయం ఇంచార్జ్ వైకుంఠం మల్లికార్జున, తిక్కారెడ్డి అసంతృప్తిగలంలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరూ టిడిపిలో కొనసాగాల వద్ద అనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. కేఈ ప్రభాకర్, వైకుంఠం మల్లికార్జున టిడిపిని వీడెందుకు నిర్ణయించుకొని వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


కేఈ ప్రభాకర్ ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి బంగపడ్డారు.. వైకుంఠం మల్లికార్జున పరిస్థితి కూడా అలానే మారింది. టికెట్ ఇవ్వకపోయినా తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడంతో అక్కడి నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మసాలా పద్మజ టికెట్ ఆశించకపోయిన అభ్యర్థి వీరభద్ర గౌడ్ కు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవసరమైతే వైసీపీలో పార్టీకి చేరెందుకు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరభద్ర గౌడ కనీసం అక్కడ ఉండే నేతలను కూడా ప్రచారానికి తనతోపాటు  రమ్మని పిలవకపోవడమే కాకుండా తమ మద్దతు అవసరం లేదనే విధంగా వ్యవహరిస్తున్నారట. చాలామంది నేతలు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.


ఇలాంటి పరిణామాలను అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. వైసీపీ నేతలు. అసంతృప్తులతో టచ్లోకి వెళ్లి.. వారికి వైసిపి కండువా కప్పేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ జోనల్ ఇన్చార్జ్ అయినటువంటి రామసుబ్బారెడ్డి అసంతృప్తులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. కేఈ ప్రభాకర్ కూడా రేపు మాపు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డోన్ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి.. కేఈ ప్రభాకర్ తో మాట్లాడిన ఒప్పుకోలేదని సమాచారం. మంత్రాలయం ఇన్చార్జ్ తిక్కారెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో మాట్లాడినా కూడా మంత్రాలయం టికెట్ పైన చాలా పట్టుదలతో ఉన్నారు.. పార్టీ కోసం చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన తనకు అన్యాయం చేశారని వాపోతున్నారు. దీంతో రేపటి రోజున వైసీపీ కండువా కప్పుకునేందుకు పలువురు నేతలు సిద్ధమయ్యారట. రేపటి రోజున క్లారిటీ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: