ఎన్నికలు వచ్చాయంటే చాలు ఏ పార్టీలో అయినా నాయకుల అలకలు, బుజ్జగింపులు, హామీలు అనే ఘటనలు సంభవిస్తూ ఉంటాయి. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో  ఈ తంతు కొనసాగింది.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 ఎలక్షన్స్ ఉండడంతో అన్ని పార్టీల నాయకులు  ఇప్పటికే వారి వారి పార్టీల అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో మునిగిపోయారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసుకున్నారు. ఇదే తరుణంలో బీజేపీ , టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థులకు సీట్ల కేటాయింపులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

టికెట్ వచ్చిన అభ్యర్థి ఆనందంతో ఉంటే, రాని అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకుంటూ  రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ అసమ్మతి రాగాన్ని  చూపిస్తున్నారు. తాజాగా జనసేనలో కూడా అసమ్మతి రాగం  వినిపించింది.  జనసేన పార్టీ నుంచి పాలకొల్లు నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జయకృష్ణకు టికెట్ కేటాయించారు. చివరి వరకు తనకే టికెట్ వస్తుందని ఆశించినటువంటి పడాల భూదేవి తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ  కన్నీరు పెట్టుకుంది. కొంతమంది నాయకులు కావాలనే నాకు టికెట్ రాకుండా చేశారని అసమ్మతి వ్యక్తం చేసింది. ఎంతో కాలం నుంచి పవన్ కళ్యాణ్ తో పనిచేస్తున్నానని, టీడీపీ నుంచి రాజీనామా చేసి వచ్చినటువంటి జయ కృష్ణకు టికెట్ ఎలా ఇస్తారని  ఆమె ప్రశ్నించింది.

 అంతేకాకుండా చాలామంది టిడిపి నేతలు కూడా నాకే టికెట్ రావాలని కోరుకున్నారని అన్నది. కానీ అనూహ్యంగా జయ కృష్ణకు టికెట్ కేటాయించడంతో వారు  సపోర్ట్ చేసే అవకాశం తక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ విధంగా జనసేన కూటమి నేతల మధ్య అసమ్మతి రాగం నడుస్తున్న తరుణంలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగినటువంటి వైసీపీ అభ్యర్థి కళావతి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఆమె గత ఎన్నికల్లో కూడా విజయం సాధించి ఎన్నో అభివృద్ధి పనులు చేసిందట.  దీంతో వైసిపి ఆమెకే మళ్ళీ టికెట్ కేటాయించడంతో, ఆమె ప్రచారంలో దూసుకుపోతుంటే, టీడీపీ కూటమి మాత్రం ఈ విధంగా అసమ్మతితో  ముందుకు వెళ్తోంది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం జనసేన అభ్యర్థిగా వచ్చిన జయకృష్ణ  గెలుపు కష్టమే అని, ఓట్ల చీలికలో కళావతి గెలిచే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: