టిడిపి పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు పాడేరు ఎమ్మెల్యే గడ్డి ఈశ్వరి పార్టీ మారిన సంగతి అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా వైసిపి పార్టీ నుంచి వీడి చంద్రబాబు వెంట నడిచిన ఈమెకు ఇప్పుడు రాజకీయంగా ఒక్కసారిగా రోడ్డును పడేసినట్లు కనిపిస్తోంది. పాడేరు సీటును గిడ్డి ఈశ్వర్ కి కాదని కిల్లు వెంకట రమేష్ నాయుడు కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో గిడ్డి ఈశ్వరి పరిస్థితి చాలా దారుణంగా అయిందని ఆమె చంద్రబాబు నాయుడు పైన ఫైర్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.


2014లో పాడేరు నుంచి వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఈశ్వరి ఆ తర్వాత కొంతకాలానికి మల్లి టీడీపీలోకి చేరడం జరిగింది. 2019లో టిడిపి పార్టీ నుంచి నిలబడి ఓడిపోయింది గడ్డి ఈశ్వరి. ఈసారి 2024 ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు సైతం ఈమెకు మొండి చేయి చూపించారు. దీంతో కొత్త అభ్యర్థిగా వెంకట రమేష్ నాయుడుని బరిలోకి దింపబోతున్నారు. తాజాగా ఇప్పుడు పాడేరు లోని ఈశ్వరి ఇంట్లో అక్కడ ఉండే టిడిపి నేతలతో ,కార్యకర్తలతో సమావేశమైన తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.


గిడ్డి ఈశ్వరి మీడియాతో మాట్లాడుతూ తాను ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది.. ఈ ఎన్నికలలో ఈశ్వరి రాజకీయ భవిష్యత్తు అటో ఇటో తేలిపోతుందని అక్కడ నేతల సైతం తెలియజేస్తున్నారు. ఈసారి ఆమె చట్టసభకు ఎన్నిక కాకపోతే ఇక మీదట రాజకీయ భవిష్యత్తు పూర్తిగా సమాప్తం అవుతుందని చర్చలు కూడా వినిపిస్తున్నాయి. టిడిపిలో చేరకుండా ఉండి ఉంటే వైసీపీ పార్టీలో కచ్చితంగా ఆమె మంత్రి అయ్యేదని ఆమె కార్యకర్తలు సైతం తెలియజేస్తున్నారు.. జగన్ ని కాదని చంద్రబాబు వెంట వెళ్లడం రాజకీయంగా తన జీవితానికి తానే సమాధి కట్టుకొనే పరిస్థితి ఏర్పడిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి గిడ్డి ఈశ్వరి ఇండిపెండెంట్గా నిలబడడంత అక్కడ ఎవరికి ఇబ్బంది వస్తుందనే విధంగా అక్కడి నేతలు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: