ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు చంద్రబాబు vs జగన్ అనేంతలో మారిపోయాయి. ముఖ్యంగా వైసిపి వై నాట్ 175 అంటూ పెద్ద ఎత్తున టార్గెట్ తో ముందుకు వెళ్తోంది. టిడిపి కూడా వై నాట్ పులివెందల అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అసలు చంద్రబాబు కంచుకోటగా ఉన్నటువంటి కుప్పం ని కొట్టడం సాధ్యమయ్యే పనే నా.. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా టిడిపి జెండా ఎగురు తున్న జెండాని దించగలరా.. కుప్పం ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో చూద్దాం.తెలుగుదేశం పార్టీకి కుప్పం కంచుకోట వంటిది. టిడిపి పార్టీ ఆవిర్భావం తర్వాత మరే జెండా కూడా కుప్పంలో ఇంతవరకు ఎగరలేదు. 1989లో కుప్పంలో అడుగుపెట్టిన చంద్రబాబు ఏడుసార్లు వరుసగా గెలుస్తూనే ఉన్నారు. ఈసారి ఎనిమిదవ సారి పోటీ చేయబోతున్నారు. అయితే ఈసారి కుప్పం పైన భారీ ప్రణాళికతో వైసిపి ప్రభుత్వం ప్లాన్ చేస్తూ చంద్రబాబును అష్టదిగ్బంధనం చేసే పనిలో ఉన్నారు. కుప్పంలో కూడా ఈసారి కచ్చితంగా వైసీపీ జెండా ఎగురవేయాలని బలంగా ప్లాన్ వేస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీ భరత్ను రంగంలోకి దింపుతున్నారు.

చిత్తూరు జిల్లాలోని కుప్పం కర్ణాటక ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నది.. టిడిపి పార్టీకి కుప్పం కంచుకోట 1983, 1985లో రంగస్వామి నాయుడు రెండుసార్లు అక్కడ టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు చంద్రగిరిలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1989లో కుప్పం నియోజకవర్గానికి మారిపోయారు.మూడు దశాబ్దాలుగా కుప్పం ప్రజలు చంద్రబాబుని ఆదరిస్తున్నారు. అక్కడ మొత్తం నాలుగు లక్షలకు పైగా జనాభా ఉన్న సుమారుగా 2,20,000 ఓటర్లు ఉన్నారట. అయితే ఇక్కడి వారి ప్రాధాన్యత ఎక్కువగా వ్యవసాయమే. అయితే ఇక్కడ ఎక్కువగా క్షత్రియ సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువగా ఉన్నదట.ప్రత్యర్థి ఎలాంటి వారైనా సరే చంద్రబాబుదే అక్కడ పై చేయి ఉంటుందట. వైసీపీ పార్టీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కడ గట్టి పోటీ ఇచ్చిన ఓడించలేకపోయారు. గతంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రమౌళి వంటి వారు చంద్రబాబును ఢీకొట్టుగా అపజయమే ఎదురయింది.

నిజానికి చంద్రబాబు మెజారిటీ ప్రతి ఎన్నికలకు తగ్గుతూ వస్తోందట. కానీ విజయం మాత్రం చంద్రబాబుదే సొంతం. చంద్రబాబును కుప్పంలో ఓడించడం అంత సులువైన  విషయం కాదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా కుప్పం అభివృద్ధిలో చంద్రబాబు మార్కు చాలానే ఉందని తెలుస్తోంది. అదునాతన ప్రభుత్వ భవనాలు, డ్రిప్ ఇరిగేషన్ ,మైక్రో, మెడికల్ కాలేజీలు ఇతరత్రా వాటిని చంద్రబాబులో ఉంచారు. ఇటీవల తన ఇంటిని కూడా చంద్రబాబు కుప్పంలో పూర్తి చేసినట్లు తెలుస్తోంది.కుప్పం మున్సిపాలిటీ తో పాటు పంచాయతీ ఎన్నికలలో వైసీపీ పార్టీ హవా చూపించింది.. ఈసారి చంద్రబాబును ఓడించాలని పెద్దిరెడ్డి కుప్పం పైన చాలా దృష్టి పెట్టారు. మొత్తానికి ఈసారి ఎన్నికలలో కుప్పం పైన చాలా ఆసక్తి పెరుగుతుంది. చంద్రబాబు పెట్టుకున్న లక్ష మెజారిటీ సాధిస్తారా.. ఈసారి కూడా వైసిపి పార్టీ అక్కడ గట్టి పోటీ ఇస్తుందా అనేది ఉత్కంఠంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: