ఈ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పొత్తుగా పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ వెస్ట్ సీటును బీజేపీ కి కేటాయించారు.అందులో భాగంగా బీజేపీ ఇక్కడి నుండి సుజనా చౌదరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఇక మొదటి నుండి ఇక్కడి సీటును జనసేన పార్టీ అభ్యర్థి పోతిన మహేష్ ఆశిస్తున్నాడు.

ఎన్నో రోజులుగా టికెట్ ను ఆశించి చివరకు టికెట్ రాకపోవడంతో ఈయన రెబల్ గా పోటీ చేస్తాడు అనే వార్తలు వచ్చాయి. ఇకపోతే మహేష్ తాజాగా వైసీపీ పార్టీలోకి జాయిన్ అయ్యాడు. ఇక మహేష్ "వైసీపీ" పార్టీలో జాయిన్ కావడంతో సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ లో చాలా కఠిన పరిస్థితులు ఏర్పడతాయి అని అంతా అనుకున్నారు.

ఎందుకు అంటే సూజన కి ఇక్కడ పెద్దగా పట్టు లేకపోవడం... ఇక ఈ ఏరియాలో బిసి , ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండడం సుజన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈయనకు ఇక్కడ క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి అని చాలా మంది అనుకున్నారు. ఇక తాజా పరిణామాల అనంతరం మహేష్ స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి బీజేపీ మరో పెద్ద ఎత్తుగడను వేసింది. పోతిని మహేష్ వైసీపీ పార్టీలోకి జాయిన్ కాగానే... సుజనా ఒక పెద్ద ఎత్తుగడ వేసి వైసీపీ పార్టీలో చాలా కాలంగా కొనసాగుతున్న పైలా సోమినాయుడిని "బీజేపీ" పార్టీలోకి తెచ్చుకున్నారు.

ఈయనకు కూడా విజయవాడ వెస్ట్ లోని చాలా ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంది. దానితో  మహేష్ వల్ల జరిగిన డ్యామేజీని ఈయనతో పూడ్చుకోవడానికి సుజనా చాలా గట్టి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే వైసీపీ పార్టీ నుండి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆసిఫ్ పోటీ చేస్తున్నాడు. ఇక సూజన మరియు ఆసిఫ్ ల మధ్య ఈ సారి విజయవాడ వెస్ట్ లో గట్టి పోటీ ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: