- క‌మ్మ భ‌ర్త‌.. బీసీ మ‌హిళ కోటాలో విడ‌ద‌ల ర‌జ‌నీకి బాబు మార్క్ చెక్‌
- టీడీపీ కంచుకోట‌లో క‌ష్టాల ఊబిలో మంత్రి ర‌జ‌నీ..?
- ర‌జ‌నీకీ దూకుడుకు భిన్నంగా దూసుకుపోతోన్న మాధ‌వి

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
మంత్రి విడుదల రజనీపై ఈ సారి గుంటూరు వెస్ట్‌లో ఎవ‌రు ప్ర‌త్య‌ర్థిగా వ‌స్తార‌న్న దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లే న‌డిచాయి. ఈ వెస్ట్ సీటు టీడీపీకి కంచుకోట కావ‌డంతో ఎంతో మంది పోటీప‌డ్డారు. ఇక్క‌డ ఇన్‌చార్జ్‌గా కోవెల‌మూడి ర‌వీంద్ర ( నాని ) ఉన్నారు. అయితే చంద్ర‌బాబు అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ బీసీల్లో బాగా వెన‌క‌ప‌డిన వ‌ర్గాల‌కు చెందిన ఓ మ‌హిళ‌కు సీటు ఇచ్చారు. ఆమే పిడుగురాళ్ల మాధ‌వి.


ఇక మంత్రి ర‌జ‌నీ అంటేనే ప్ర‌జ‌ల్లో కంటే సోష‌ల్ మీడియాలో ఎక్కువుగా ఉంటారు. మీడియా ముందు హ‌డావిడి చేస్తార‌న్న పేరుంది. అయితే ఇందుకు భిన్నంగా ఆమె ప్ర‌త్య‌ర్థి మాధ‌వి రాజ‌కీయం ఉంటుంది. మాధవికి సీటు రావడంతోనే ఆమె జెయింట్ కిల్లర్ అయిపోయారు. విచిత్రం ఏంటంటే మాధవికి కూడా క్యాస్ట్ ఈక్వేషన్ లో చంద్రబాబు సీటు ఇచ్చారు. ఆమె బీసీలలో రజక సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. ఆమె భర్త గల్లా రామచంద్రరావు కమ్మ సామాజిక‌ వర్గానికి చెందినవారు. ర‌జ‌నీ బీసీలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి, భువనగిరి జిల్లాకు చెందినవారు.


ర‌జనీ చిలకలూరిపేటలోని కాపు సామాజిక వర్గానికి చెందిన విడుదల కుమారస్వామిని వివాహం చేసుకోవడంతో ఆమె చిలకలూరిపేటకు కోడలు అయ్యారు. ఇలా బీసీ కాపు ఈక్వేషన్‌తో సీటు ద‌క్కించుకున్న రజని.. గత ఎన్నికలలో తాను ఇటు బీసీని అని చెప్పుకోవడంతో పాటు.. అట్టు కాపు ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కోడలిని అని చెప్పుకుని బాగా లబ్ధి పొందారు. ఈ సారి ఆమె అలా చెప్పుకోవ‌డానికేం మిగ‌ల‌కుండా మాధ‌వి చేస్తున్నారు.


వ్య‌క్తిత్వంలో మాధ‌వి ఇట్టే ఆక‌ట్టుకుంటున్నారు. మాధ‌వికి అలా సీటు వచ్చిందో.. లేదో కూల్‌గా.. స్మూత్‌గా ప్ర‌జ‌ల్లోకి వెళుతున్న మాధవి మంత్రి రజినికి చెమటలు పట్టిస్తున్నారు. రజనీలా దూకుడుగా కాకుండా చాలా స్మూత్గా సుతిమెత్తని విమర్శలు చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకు పోతున్నారు. మాధవి మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా కనిపిస్తోంది. చాలా కూల్ గా రాజకీయం చేస్తూ అటు దూకుడుగా వెళుతున్న మంత్రి రజినితో ఢీ అంటే ఢీ అనేలా మాధవి వ్యవహరిస్తున్న తీరు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.


ఏది ఏమైనా మంత్రి రజ‌నీని ఓడిస్తే పిడుగురాళ్ల మాధవి.. గుంటూరు పొలిటిక‌ల్‌ జెయింట్ కిల్లర్గా సగర్వంగా అసెంబ్లీలో అడుగు పెడతారు. మరి దానిని ఆమె సాధించి తీరుతారో లేదో చూడాలి. గ‌తంలో ఇక్క‌డ నుంచి గెలిచిన శ‌న‌క్కాయ‌ల అరుణ మంత్రి అయ్యారు. ఇప్పుడు మాధ‌వికి బీసీ ఈక్వేష‌న్ కూడా క‌లిసి రావ‌డంతో ఆమె మంత్రి అయినా అవ్వ‌వ‌చ్చ‌న్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: