రజినీని నెలబెట్టిన కులాంతర వివాహం 
2019 లో రజినికీ బాగా మధ్ధతిచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలు 
• గుంటూరులో కూడా చిలకలూరిపేట సీన్ రిపీట్ చేసేందుకు రజినీ గట్టి ప్రయత్నాలు 


వైసీపీ మహిళా నేత విడదల రజిని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకే ఒక్క స్పీచ్ తో సోషల్ మీడియాని షేక్ చేసేసి బాగా పాపులర్ అయ్యింది. సైబరాబాద్ లో మీరు నాటిన చెట్టు మొక్క సార్ నేను అనే డైలాగ్ తో విడదల రజని సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గతంలో తెలుగు దేశం పార్టీ నేతగా ఉన్న విడుదల రజని ఆ  తర్వాత వైసీపీలోకి వచ్చి వైసీపీ నేతగా మారారు. 2019లో విడదల రజనీ చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమె ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


నిజానికి విడదల రజని పుట్టి పెరిగింది తెలంగాణా రాష్ట్రంలో. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో జన్మించారు రజని. చదువు పూర్తయ్యిన తరువాత విడదల రజని హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశారు.రజినీది కులాంతర వివాహం. బీసీ చాకలి కులానికి చెందిన రజినీ కుమార స్వామి అనే కాపు కులానికి చెందిన వ్యక్తిని  వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. అక్కడే వారు సాఫ్ట్ వేర్ కంపెనీని స్థాపించారు. బాగా సంపాదించి ఆర్థికంగా బాగా స్థిరపడ్డాక పేదవారికి సాయం చేయాలని ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ప్రమేయంతో రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు దేశం పార్టీలో టికెట్ లభించకపోవడంతో ఆమె వైసీపీలో చేరి ఏకంగా తన గురువు పుల్లారావు పైనే పోటీ చేసి విజయం సాధించారు.


ఇలా విజయం సాధించాడనికి రెండు కారణాలు ఉన్నాయి. ఆమెకు రెండు కులాల నుంచి జనాల మద్ధతు లభించింది. తన కుల ప్రజల నుంచి అలాగే తన భర్త కాపు కులం ప్రజల నుంచి జనాల మద్దతు లభించింది. పైగా చిలకలూరిపేటలో బీసీ ప్రజలు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూలి పనుల కోసం వచ్చిన కాపు కులస్థులు ఎక్కువ. అందువల్ల వాళ్ళ ఓట్లు రజినికీ బాగా ప్లస్ అయ్యాయి. ఈ విధంగా రజినీ కులాంతర వివాహం వైసీపీకి బాగా ప్లస్ అయ్యింది.విడదల రజని సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ప్రజల్లో మమేకమయ్యే దృశ్యాలని ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. అంతేగాక విడదల రజని ప్రజల్లో బాగా కలసి పోతారు. అందువల్ల ఆమెకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.


ఈసారి గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేస్తున్నారు. గుంటూరులో కూడా ఉత్తరాంధ్ర నుంచి పనుల కోసం వచ్చిన బీసీ, కాపు ప్రజలు ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ కోసం రజినీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి గుంటూరులో కూడా రజినీకి చిలకలూరిపేట సీన్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: