విశాఖ: బీమిలిలో శ్రీను Vs శ్రీను అనేలా ఇద్దరూ శ్రీనుల మధ్య వార్ జరుగుతుంది. వీరు ఇద్దరూ రాజకీయంగా ఓటమి ఎరుగని వారే. ఆ ఇద్దరు కూడా గెలుపుని వెతుక్కుంటూ భీమిలీ బరిలోకి దిగారు. ఇక వారిలో ఒకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఇద్దరి శ్రీనులకు పేరులోనే కాదు రాజకీయాల్లో కూడా చాలా పోలికలు ఉన్నాయి.వీరు ఇద్దరూ ఎంపీలుగా అనకాపల్లి నుంచే నెగ్గారు. ఇంకా ఎమ్మెల్యేలుగా భీమిలీ నుంచి పనిచేశారు. ఇద్దరికీ భీమిలీ అంటే ఇష్టం ఎక్కువ. ఇద్దరూ ఎప్పుడూ ఓటమి పాలు కాలేదు. ఇప్పుడు భీమిలీలో గెలుపు ఎవరితో తెలియదు కానీ ఒకరికి మాత్రం కచ్చితంగా ఓటమి దక్కడం ఖాయం.ఓటమి వీరుడు ఎవరు అన్నది కూడా ప్రస్తుతం రెండు పార్టీలలో కూడా తీవ్రమైన చర్చగా ఉంది. గంటా అయితే బిగ్ షాట్ గా బరిలోకి దిగిపోయారు. ఆయన జనంలోకి వెళ్లడం కన్నా ఎక్కువగా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆయన వైసీపీలో ఉన్న నాయకులను టీడీపీలోకి చేర్చే పనిలోనే బిజీగా ఉన్నారు.కానీ ఆ జోరుని మాత్రం వైసీపీ చేయలేకపోతోంది. ఇక భీమునిపట్నంలో గ్రామాలు ఎక్కువ. అందువల్ల ఆ గ్రామాలలో వైసీపీ పథ‌కాలు బాగా వెళ్లాయి.


అదే ప్రస్తుతం టీడీపీని బాగా కలవరపెడుతోంది.ఇంకా అంతే కాదు మహిళా ఓటింగ్ ఇక్కడ ఎక్కువగా ఉంది. అలాగే కాపులు తరువాత బీసీలు ఇంకా ఎస్సీలు కూడా ఎక్కువగా ఉన్నారు. ఆ ఓటు బ్యాంక్ వైసీపీకి పూర్తి స్థాయిలో టర్న్ అయితే టీడీపీకి చాలా ఇబ్బందని అంటున్నారు.ప్రతీ ఎన్నిక కూడా ఒక భిన్నమైనది గానే ఉంటుంది. 2014 లాగానే ఈసారి గెలిచేయవచ్చు అనుకుంటే టీడీపీకి కుదరదు అని అంటున్నారు. ఇక టీడీపీ జనసేనలో ఉన్న అసంతృప్తులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవి చాప కింద నీరులా ఉన్నాయి. పైకి నాయకులు ఏదో కలసినంత మాత్రాన వారు కలవాలని లేదు.ఇక వైసీపీ లీడర్ అవంతి శ్రీనివాసరావు జనంలో ఉంటారని పేరు ఉంది. అయితే ఆయన ఇంకా దూకుడు పెంచాలిసి ఉంది.ఎందుకంటే గంటాను తట్టుకుని ప్రతి వ్యూహాలను రూపొందించడంలో వైసీపీ తడబడుతోంది.ఇలా వైసీపీ- టీడీపీల మధ్య పోరు చాలా ఆసక్తికరంగానే ఉంది. ఈసారి ఈ ఇద్దరు శ్రీనుల జాతకం భీమిలీ నిర్ణయిస్తుంది. భీమిలీ ఇద్దరు శ్రీనులకు భీమిలీ రాజకీయంగా ఎప్పటికీ గుర్తుండిపోయే తీర్పు ఇస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: