ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడేకొద్ది అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పోటీ చేసే అభ్యర్దులే మాకిచ్చిన టికెట్ ఉంటుందో ఊడుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. దాంట్లో భాగంగా ఉమ్మడిగుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంలో సైకిల్ పరుగులు తీస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి మంత్రి విడుదల రజిని గెలిచి తర్వాత గుంటూరు కు మకాం మార్చింది. టీడీపీ నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అయితే వైసీపీ ఈసారి రజినిని కాదని మొదటమల్లెల రాజేష్ నాయుడుకి టికెట్ ఇచ్చింది. ఆయన ప్రచారంలో దూకుడు పెంచుతున్న సమయంలో వైసీపీ అధిష్టానం దానికి బ్రేక్ వేసి టికెట్ వేరేవాళ్లకి ఇచ్చింది. దాంతో రాజేష్ నాయుడు టీడీపీలో చేరిపోయారు. ఇది ప్రత్తిపాటి విజయాన్ని మరింత పెంచింది.

అసలు నియోజకవర్గంతో సంబంధం లేని కావటి మనోహర్ నాయుడుకి వైసీపీ ఇక్కడ టికెట్ ఇచ్చింది. అయితే దీనిని స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. మరోవైపు మర్రి రాజశేఖర్‌కు కూడా టికెట్ ఇవ్వకుపోయిన ఆయన సర్దుకుంటే ఆయన వర్గం మాత్రం ఫైరవుతున్నారు. స్వయంగా మర్రి ఫోన్లు చేసి పిలుస్తున్నా మెజారిటీ నాయకులు కార్యకర్తలు కావటి ప్రచారానికి రాకుండా దాటేస్తున్నారు.ఒకవేళ వచ్చిన ఎక్కువ సేపు ప్రచారములో ఉండకుండా పోతున్నారు. దీంతో కావటి ప్రచారం పది మందికి తక్కువ ఐదుగురికి ఎక్కువ అన్నట్టుగా ఉంది. ప్రత్తిపాటి పుల్లారావు తన కుటుంబంపై వైసీపీ కక్ష సాధింపు చర్యలను చేస్తుందని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా వైసీపీ సర్కారు తన కుటుంబాన్ని ఎలా వేధించిందీ అనేది వివరిస్తున్నారు. తన కుమారుడి అరెస్టును ఆయన తెరమీదికి తెస్తున్నారు.

ఫైనల్ గా చిలకలూరి పేట నియోజకవర్గంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నది అక్కడ ప్రజల మాట.క్షేత్రస్థాయిలో పుల్లారావుకు లభిస్తున్న ఆదరణ టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్‌, పుల్లారావు కుటుంబానికి దక్కుతున్న సింపతీ వంటివి ఆ పార్టీకి బాగా ప్లస్‌గా మారాయి. ఇక, వైసీపీలో సమన్వయ లోపం, నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు వంటివి ఆ పార్టీకి తీరని లోటుగా మారాయి. దాంతో సైకిల్ గెలవడం ఖాయమని అంటున్నారు ఇక్కడి ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: