ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది అధికార పార్టీ వైసీపీకి అసమ్మతి నేతలు షాక్ మీద షాక్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే అధికార పార్టీ అభ్యర్థులు అసమ్మతి నేతల వల్ల ఇబ్బంది పడుతున్నారు.కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీలో అసమ్మతి పోరు ఎక్కువగా కనబడుతుంది.అయితే పల్నాడు లోని పెదకూరపాడు నియోజకవర్గంలో ఇదే తరహాలో వైసీపీలో తీవ్ర అసమ్మతి కనబడుతుంది.వైసీపీ అభ్యర్థి నంబూరు శంకరరావుకి సొంత పార్టీ నేతలే తీవ్ర తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది.టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ను బరిలోకి దించిన తర్వాత పూర్తిగా అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోయినట్లు తెలుస్తుంది.ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కూడా తన పూర్తి మద్దతు భాష్యం ప్రవీణ్కు ఇస్తున్నట్లు తెలిసింది.దాంతో ఇద్దరు కలిసి ప్రచారములో ముందుకు పోవడంతో వైసీపీ అభ్యర్థి నంబూరు శంకరరావుకి కంటి మీద కునుకు లేకుండా పోయింది.శంకరరావుతో కలిసి ప్రచారం చేస్తున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు తాము టీడీపీకి సపోర్ట్ చేస్తాం అని డైరెక్ట్ గా చెప్పడంతో అది వైసీపీని ఇంకా కలవరపెడుతుంది.ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్న శంకరరావుకి ప్రస్తుతం భయంగా ఉందని అతని అనుచరులే చెప్తున్నారు. ఇటీవల వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రైస్ కుక్కర్లు,నగదు, మిక్సీలు పంపిణి చేసారు. ప్రవీణ్ ప్రచారానికి నియోజకవర్గ ప్రజల విశేష మద్దతు లభిస్తుంది.దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు కొంతమంది పై అక్రమ కేసులు పెడుతున్నారు.ప్రవీణ్ ప్రచారం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో వైసీపీ ఓటమి తప్పదని ఆ పార్టీనేతలే భావిస్తున్నారు.అలాగే ప్రజగళం పేరుతొ చంద్రబాబు క్రోసూరులో నిర్వహించిన సభకు ప్రజాదరణ బాగా లభించడంతో వైసీపీ నేతలలో కలవరం ఇంకా పెరిగింది.ఇంకోవైపు నంబూరు శంకరరావు పై ఇసుక దోపిడి, జగనన్న లేఅవుట్ లపై అవినీతి ఆరోపణలు కూడా ఆయన్న తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి.చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శంకరరావుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.దీన్ని తట్టుకోలేని వైసీపీ నేతలు క్రోసూరులోని టీడీపీ కార్యాలయంపై పెట్రోల్ పోసి దగ్ధం చేసారు.ఇలాంటి పరిణామాలు గమనిస్తున్నా అక్కడి ప్రజలు శంకరరావుపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: