ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలయింది. మే 13 న రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.. దీనితో మరోసారి అధికారం చేపట్టెందుకు వైసీపీ నేత జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం హోరు కొనసాగిస్తున్నారు.. అలాగే ప్రధాన ప్రతి పక్షాలు అయిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి జగన్ మోసాలపై, అవినీతిపై తీవ్ర విమర్శలు చేస్తు నిత్యం ప్రజలలోనే మమేకం అవుతూ వరుస హామీలను ఇస్తుంది.. ఇదిలా ఉంటే 2014 రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగయ్యింది.. ఆ పార్టీకి రాష్ట్రంలో ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంది. దీనితో ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కాంగ్రెస్ పుంజుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేతగా షర్మిలకు పగ్గాలు అప్పజెప్పారు..అధికార పార్టీపై కాంగ్రెస్ షర్మిల అనే అస్త్రాన్ని వదిలింది.

ఈ సారి ఎన్నికలలో రాష్ట్రంలో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ముందడుగు వేస్తుంది.. బలమైన వైసీపీ పార్టీని, ప్రతిపక్ష కూటమిని ఎదుర్కొనడానికి కాంగ్రెస్,వామపక్ష పార్టీల మధ్య పొత్తు కుదిరింది.పొత్తులో భాగంగా సీపీఎం తరపున ఒక ఎంపీ, 8 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు కాంగ్రెస్ తో ఒప్పందం కుదిరింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడిన స్థితిలో వామపక్షాలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి.

అరకు (ఎస్టీ) పార్లమెంట్ స్థానానికి పాచిపెంట అప్పలనర్సయ్య, రంపచోడవరం (ST) కు లోతా రామారావు, నెల్లూరు సిటీకీ మూలం రమేష్‌, కురుపాం (ఎస్టీ)కి మండంగి రమణ, గాజువాక నుంచి మరడాన జగ్గునాయుడు, విజయవాడ సెంట్రల్‌ కు చిగురుపాటి బాబురావు, గన్నవరం నుంచి కళ్లం వెంకటేశ్వరరావు, మంగళగిరికి జొన్నా శివశంకర్‌ పోటీ చేస్తుండగా పాణ్యం స్థానాన్ని పెండింగ్ లో ఉంచారు. గత ఎన్నికలలో జనసేన పోటీ చేసిన భీమవరం, గాజువాకలో టీడీపీ ప్రచారం చేయలేదు. అలాగే కుప్పం,మంగళగిరి, హిందూపూర్ జనసేన ప్రచారం చేయలేదు. దీనితో వారిరువురి పార్టీలు ఒకటే అని గత ఎన్నికలలో ప్రచారం చేసింది.. అయితే ఈ సారి ఎన్నికలలో పొత్తులో భాగంగా మంగళగిరి సీటును కాంగ్రెస్ సీపీఎం కు కేటాయించింది.. ఈ సారి మంగళగిరి లో కాంగ్రెస్ పోటీలో లేదు.. దీనితో బాబుకు షర్మిల గిఫ్ట్ ఇచ్చినట్లుగా అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: