కూటమిలా భాగంగా రాజంపేట టికెట్ ను సైతం kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెచ్చుకున్నారు. దీంతో ప్రచారంలో వేగవంతంగా పాల్గొన్నారు.. kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఈయన రాజకీయానికి ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి.. జై సమైక్యాంధ్ర అనే పార్టీని పెట్టి కూడా తాను పోటీ చేయకుండా అభ్యర్థులను నిలబెట్టి ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా లేకుండా అయ్యారు.కొన్నేళ్లపాటు రాజకీయ అజ్ఞానంలోకి వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ బిజెపితో ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి లోక్సభ బరిలో రాజంపేట బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. కూటమి రాజకీయాలు ఈయనను కుంగదీసేలా కనిపిస్తున్నాయని పలువురు రాజకీయ నాయకులు తెలియజేస్తున్నారు. టిడిపి, జనసేన, బిజెపి పార్టీలోని అంతర్గత విభేదాలు నల్లారి కిరన్ కుమార్ రెడ్డినీ ఇరకాటంలో పెడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉమ్మడి కడప జిల్లా నుంచి. రాజంపేట రైల్వే కోడూరు, రాయచోటి ఉండగా.. చిత్తూరు జిల్లా నుంచి పీలేరు, మదనపల్లె ,తంబళ్లపల్లె, పుంగనూరు అసెంబ్లీ కలుస్తున్నాయి.నల్లారికి సొంత జిల్లా ఆయన చిత్తూరులో కొంత పట్టు ఉంది. పైగా తన సొంత నియోజకవర్గం కోసం పీలేరు నుంచి తన సొంత తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టిడిపి తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో అక్కడ పెద్దగా సమస్యలు లేవు. కానీ ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట, రైల్వే కోడూరు వంటి నియోజవర్గాలలో కిరణ్ కుమార్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నాయట.. కోడూరు నుంచి జనసేన గా ఉన్న అభ్యర్థి వైసిపి కోవర్ట్ అంటూ అరవ శ్రీధర్ అనే వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చి విజయం సాధించిన కిరణ్ కుమార్ రెడ్డికి..రాజంపేట టిడిపి ఎంపీ టికెట్ విషయమై ఇరకాటంలో పడ్డారట. ఇక్కడ మొదటి నుంచి రేసులో ఉన్నచంగల్రాయుడు ను తప్పించి సుగువాసీ బాలసుబ్రమణ్యం పేరును ఖరారు చేసిన తర్వాత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయట. కూటమికి సహకరించానంటూ చెప్పేస్తున్నారట. స్వతంత్ర అభ్యర్థిగా అయిన పోటీ చేస్తామంటూ తెలియజేస్తున్నారట. కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా నచ్చజెప్పే పని చెప్పిన ఫలించలేదట. ముఖ్యంగా మిధున్ రెడ్డి లాంటి బలమైన సిట్టింగ్ ఎంపీకి గట్టి పోటీ ఉంటుందనుకుంటున్న సమయంలో ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారంటూ కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితులు తెలియజేస్తున్నారు. కూటమిలోని కుంపట్లు నల్లారిన నిలువునా ముంచుతాయా.. మరి వీరి మధ్య అంతర్గత విభేదాలు చల్లారుతాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: