ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జోరు కొనసాగుతోంది.  ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాలు అభ్యర్థులంతా  ప్రచారంలో మునిగిపోయారు. అన్ని పార్టీలు చాలావరకు వారి వారి అభ్యర్థులను కేటాయింపు చేశారు. దీంతో ఎక్కడి కక్కడ అభ్యర్థులు  ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. ఇదే తరుణంలో వైసిపి అభ్యర్థి తోట త్రిమూర్తులకు కొత్త టెన్షన్ మొదలైంది. ఆయన మండపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రచారం సాఫీగా సాగుతున్న తరుణంలో  కోర్టు కేసు కలవర పెడుతోందట.

 ఇంతకీ ఆ కేస్ ఏంటి ఆయన ఎన్నికలపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా?అనే వివరాలు చూద్దాం..అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా దళిత యువకుల శిరోముండణం సంచలనం సృష్టించింది. దీనిపై కేసు కూడా నమో దయింది.  1996 డిసెంబర్ లో రామచంద్రాపురం మండలంలోని వెంకటాయపాలెంలో దళిత యువకులను ఇబ్బందులకు గురిచేసి  అందులో ఇద్దరికీ శిరోముండనం చేశారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అవ్వడమే కాకుండా కేసులు కూడా నమోదయ్యాయి.  ఇందులో  పదిమంది వ్యక్తులను నిందితులుగా గుర్తించిన పోలీసులు, ప్రధాన ముద్దాయిగా ఎమ్మెల్యే, ప్రస్తుత వైసిపి  అభ్యర్థి తోట త్రిమూర్తులను ప్రకటించింది.

  ఈయన ప్రస్తుతం మండపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇదే తరుణంలో  ఈ కేసు బయటకు వచ్చింది. ఏప్రిల్ 12న దీన్ని తుది తీర్పు ఉండాలి. కానీ మరోసారి వాయిదా పడింది. ఇప్పటి వరకు ఈ కేసు 146 సార్లు వాయిదా పడిందని తెలుస్తోంది. 28 సంవత్సరాలుగా బాధితులంతా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా తోట త్రిమూర్తులకు శిక్ష పడాలని తొందరగా కేసు తీర్పు వెలువరించాలని బాధితులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఈ ఇష్యూ బయటకు రావడంతో త్రిమూర్తులు పై కాస్త ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: