అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎన్నికల సునామీని సృష్టిస్తుందని బీజేపీ భావించింది. అందుకే దేవాలయం ప్రారంభించిన వెంటనే 370 సీట్లు కైవసం చేసుకుంటామని ఎన్డీయే కూటమి 400 సీట్లు దాటుతుందగి గట్టిగా ప్రకటించింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం తప్ప ఇప్పటివరకు ఏ పార్టీ కూడా 400 పైగా సీట్లు సాధించింది లేదు. అయితే దీనిని బ్రేక్ చేయడం సాధ్యం కాదని గ్రహించడానికి మోదీకి పెద్దగా సమయం పట్టలేదు.


అందుకే చేజారిపోతున్న అవకాశాన్ని నిలబెట్టుకోవాలని అన్ని ఉపాయాలను ఆశ్రయిస్తోంది. ప్రధాని మోదీ చాలా తెలివైన వారు. ప్రజాకర్షక నేత. కానీ బీజేపీ ని విజయ తీరాలకు చేర్చాలంటే తన ముఖం, వ్యక్తిత్వం సరిపోవని ఆయన భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ రాముడిని అవమానించింది అనే కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో పాటు కొన్నేళ్ల  క్రితం ముగిసిన కచ్చ దీవులను తెరపైకి తెచ్చారు.


2014లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఉపయోగించుకొని అచ్చేదిన్ వాగ్దానం ద్వారా 282 సీట్లు సాధించగలిగింది. ఇక 2019లో పుల్వామాలో కేంద్ర బలగాలపై మారణకాండను ఉపయోగించుకోవడం ద్వారా బీజేపీ తన సంఖ్యను అనూహ్యంగా 303కి పెంచుకుంది. పుల్వామాలో రక్తపాతానికి ముందు, బీజేపీ చాలా తక్కువ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశారు. కానీ పుల్వామా ఎటాక్ ఆ పార్టీకి గేమ్ ఛేంజర్ అయింది. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ప్రారంభించిన తర్వాత ఏప్రిల్ మేలో ఎన్నికల సునామీ సృష్టిస్తామని బీజేపీ భావించింది.


అందుకే పదేపదే ఈ విషయమై సెంటిమెంట్ రగల్చుతోంది. మరోవైపు పాకిస్థాన్ ఉగ్రవాదంపై కూడా మాట్లాడుతోంది. మీకు చేతకాకపోతే చెప్పండి మేం వచ్చి పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం అంటూ ఆ దేశానికి సలహాలు ఇస్తూ భారతీయుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. నిజంగా ప్రధాని మోదీకి తన పాలనపై నమ్మకం ఉంటే ఈ పదేళ్లు చేసిన అభివృద్ధి ఎజెండా పై చర్చ పెట్టి ఎన్నికలకు వెళ్తారు. కానీ ఆయన మరోసారి సెంటిమెంట్ రాజకీయాలనే నమ్ముకున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: