పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈసారి జనసేన... తెలుగుదేశం, ఎన్డీఏ పార్టీలతో కలిసి ఎన్నికల్లో దిగిపోతుంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సీట్లు దక్కాయి. దానితో ఇంతకాలం ఈ పార్టీ నుండి టికెట్ ను ఆశించి రానివారు ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సీటు దక్కని వారు వైసీపీ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పోతిన మహేష్ , మనుక్రాంత్ రెడ్డి , పితాని బాలకృష్ణ , పాముల రాజేశ్వరి సహా పలువురు నేతలు పార్టీకి గుడ్‌ బై చెప్పారు.

మరికొందరు కూడా వీరి దారిలోనే నడవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీటు ఆశించి దక్కని వారికి ఉన్నత పదవులు ఇస్తాను అని బుజ్జగించేందుకు ప్రస్తుతం పవన్ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ తెలంగాణ ఎన్నికల గురించి అసలు పట్టించుకోడు అని అంతా అనుకున్నారు. కానీ సడన్ గా మరికొన్ని రోజుల్లో జరగబోయే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీస్పేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అందుకోసం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోసం సమన్వయ కమిటీని కూడా పవన్ ఏర్పాటు చేశారు. బొంగునూరి మహేందర్‌రెడ్డి సమన్వయకర్తగా , శంకర్‌ గౌడ్ , రాజలింగం, పొన్నూరి శిరీష , ప్రేమ్‌కుమార్‌ , ములుకుంట్ల సాగర్‌ ఇందులో సభ్యులుగా ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పొత్తులో భాగంగా జనసేన తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసింది. పొత్తులో భాగంగా ఏడు అసెంబ్లీ స్థానాల నుండి బరిలోకి దిగిన జనసేన కాండిడేట్ లు ఎక్కడ కూడా ప్రభావాన్ని చూపలేదు.

దానితో పవన్ తెలంగాణ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాడు అని అంతా భావించారు. సడన్ గా జనసేన అధినేత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టిసిపేట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు 17 లోక్ సభ స్థానాలకుగాను ఒక్క నియోజకవర్గానికి కూడా జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ ప్రక్రియకి ఇంకా కేవలం ఐదు రోజులే ఉంది. ఈ సమయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి జనసేన ఈసారి ప్రత్యక్షంగా పోటీలోకి దిగుతుందా లేక గతంలో లాగా ఇతర పార్టీలతో పొత్తులో బరిలోకి దిగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: