గోదావరి: కంచుకోటలో టీడీపీ ఓటమి తప్పేలా లేదు?


* పశ్చిమ గోదావరి ఉండిలో టీడీపీ పరిస్థితి దారుణం
* చంద్రబాబు నిర్ణయాలతో పెరుగుతున్న అసంతృప్తులు
* టీడీపీ కంచుకోట ఉండిలో ఓటమి తప్పేలా లేదుగా


తెలుగు దేశం పార్టీకి ఉన్న బలమైన నియోజకవర్గాల్లో వెస్ట్ గోదావరి కూడా ఒకటి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ హవా ఉన్నా.. ఉండిలో మాత్రం తెలుగు దేశం పార్టీ చాలా సునాయాసంగా గెలుపు సాధించి అక్కడ విజయం దక్కించుకుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మాత్రం అలా అంత సులభంగా అయితే లేదు. ఉండి లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే తెలుగు దేశం పార్టీ లో బాగా పెరుగుతున్న అసంతృప్తులు ఇంకా అలాగే పార్టీ అధినేత అయిన చంద్ర బాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలతో ఉండి నియోజకవర్గంలో ఈ సారి ఖచ్చితంగా గండి పడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.


తెలుగు దేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు టికెట్ ని ఆశించారు. ఇంకా అదే విధంగా 2014 వ సంవత్సరంలో గెలిచిన శివరామరాజు కూడా టికెట్ ఆశించారు.ఈ ఇద్దరికీ కాకుండా.. చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీకి కేటాయించాలని నిర్ణయించారు. నిజానికి తొలి జాబితాలోనే మంతెన రామరాజు టికెట్ దక్కించుకున్నారు. రఘురామకు ఈ సీటును ఇవ్వాలని అనుకున్నారు. కానీ, రఘురామ ఎంపీ సీటు కోసం పట్టుబడుతుండడంతో.. ఉండిని బీజేపీకి ఇచ్చేసేందుకు చంద్రబాబు నాయుడు రెడీ అయ్యారు. దీంతో ఉండి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ నాయకులే రెబల్స్‌గా రంగంలోకి దిగుతున్నారు.


మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో నరసాపురం నుంచి తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చవి చూసిన శివరామరాజు.. ఇప్పుడు అక్కడ రెబల్‌గా నామినేషన్ పట్టుకుని తిరుగుతున్నారు. ఇక, సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు కూడా.. రెబల్‌గా మారేందుకు సిద్ధం అయ్యారు. తనకు టికెట్ కనుక పార్టీ ఇవ్వకపోతే.. తన పరిస్థితి తనకు తెలుసునని ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఇద్దరికీ కాకుండా.. బీజేపీకి ఇచ్చేస్తే.. ఏ గొడవా ఉండదని తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు లెక్కలు వేసుకున్నారు. కానీ, గెలిచే స్థానంలో బీజేపీ ని కనుక తెచ్చిపెడితే.. అంతిమంగా.. తెలుగు దేశం పార్టీకే తీవ్ర నష్టమని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో ఏం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: