నారా లోకేష్ ఈసారి ఎన్నికలలో కూడా టిడిపి పార్టీ నుంచి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికలలో కూడా ఈ నియోజకవర్గం నుంచి నారా లోకేష్ పోటీ చేయగా.. 52 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి వరుసగా వైఎస్సార్సీపీ పార్టీ ఆళ్ల రామకృష్ణ రెడ్డి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈసారి ఎన్నికలలో వైసీపీ పార్టీ తమ అభ్యర్థిని మార్చింది. బిసి మహిళా నేత లావణ్యను పోటీకి దించారు. ఇప్పుడు బోడె రామచంద్ర యాదవ్ కూడా BCY పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు.


అయితే రామచంద్ర యాదవ్ సొంత నియోజకవర్గం పుంగనూరు అయినప్పటికీ.. గత ఎన్నికలలో అక్కడ జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకొని సొంతంగా గ్రౌండ్ రియాల్టీ సంపాదించుకుంటున్నారు. అయితే ఇప్పుడు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకటి తన సొంత నియోజకవర్గం పుంగనూరు తో పాటు.. రాజధాని ప్రాంతంలో కూడా తన ప్రాధాన్యత ఉండాలని రాజధాని ప్రాంతంలో ఉండే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈయన నిలబడడం ఎవరికి దెబ్బ?  లోకేష్ కి ఏదైనా మైనస్ అవుతుందా? అనే విషయం తెలుసుకుందాం.


ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే.. 25 వేల ఓట్ల మెజారిటీతో లోకేష్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లోకేష్ కు సింపతి ఉండడమే కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయట. ముఖ్యంగా రాజధాని ఎఫెక్ట్ కూడా అక్కడ బాగా చూపిస్తోంది. చదువుకున్న వారు, స్థానికంగా బాగా అవగాహన ఉన్నవారు.. ఆలోచన శక్తి ఎక్కువగా ఉన్నవారు, ఆఖరికి విద్యావంతులు కూడా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మంగళగిరి. వీరంతా కూడా నారా లోకేష్ పట్ల సానుకూలంగానే ఉన్నారు.


ఒకవేళ వైసీపీలో వర్గ పోరు అనేది లేకపోతే.. చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది.. మరి రామచంద్ర యాదవ్ ఎంట్రీ తర్వాత.. 30 గ్రామాలలో సీన్ మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ సొంత సామాజిక వర్గంతో పాటు.. పార్టీపరంగా వ్యక్తిగతంగా కూడా కొంత వర్గం అక్కడ ఉన్నది. చాలామంది స్నేహితులు, సన్నిహితులు,  కార్యకర్తలు , నాయకులు కూడా ఆయనని మంగళగిరి నుంచి పోటీ చేయమని సలహా ఇవ్వడంతో అక్కడి నుంచే పోటీ చేస్తున్నారట. కొన్ని స్పష్టమైన హామీలు ప్రణాళికలతోనే మంగళగిరిలో పోటీ చేస్తున్నారు రామచంద్ర యాదవ్..


ఒకవేళ రామచంద్ర యాదవ్ కు 15 వేల ఓట్లు వచ్చాయంటే.. ఈ ఓట్లలో 12 వేల ఓట్లు టిడిపికి పడాల్సిన ఓట్లే ఉంటాయట. ముఖ్యంగా మంగళగిరిలో బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఈయన కూడా బీసీలకు కనెక్ట్ అయ్యే వ్యక్తి.  దాదాపు 80%  శాతం ఓట్లు బీసీలవే ఉన్నాయి. ప్రస్తుతం అయితే టీడీపీ ఓట్లు ఆయన చేతిలో ఉన్నాయి.. మరి ఎలక్షన్ సమయానికి రామచంద్ర యాదవ్ టీమ్ మరింత గ్రౌండ్ వర్క్ చేసి బాగా పేరు పొందేలా చేస్తే వీరి ఓట్లు చీలుతాయని చెప్పవచ్చు. ఎలా చూసిన కూడా లోకేష్ ఓట్ బ్యాంకు కు గండి పడేలా కనిపిస్తోంది. దీంతో లోకేష్ అప్రమత్తంగా ఉండడం మంచిది. మొత్తానికి అయితే రామచంద్ర యాదవ్ రాక లోకేష్ కు బట్టి దెబ్బ తగిలేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: