ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే తరుణంలో అన్ని పార్టీలు ఇప్పటికే వారి వారి అభ్యర్థులను ప్రకటించాయి. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ప్రచార హోరులో మునిగిపోయారు. ఓ వైపు ప్రచారం జరుగుతుంటే మరోవైపు సర్వేల పర్వం కొనసాగుతోంది.  కొన్ని సర్వేలు టిడిపి కూటమి గెలుస్తుంది అంటే మరికొన్ని సర్వేలు  వైసిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెబుతున్నాయి.

 ఏ పార్టీ గెలిచినా  ఓట్ షేరింగ్లో 1% మాత్రమే తేడా ఉంటుందని  అంటున్నారు.  దీంతో ఏపీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇదే తరుణంలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఏపీలో గెలవబోయేది  కూటమితో కూడిన టిడిపి పార్టీ అని కొంతమంది అంటే,  మరికొంతమంది జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాడని వారు వన్ సైడ్ అంటూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  మాజీ మంత్రి కేటీఆర్ కూడా  ఒక మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలవబోతున్నారనే ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇచ్చారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి  అధినేత జగన్ నాకు అన్న లాంటివారు. అలాగే చంద్రబాబు నాయుడు  చాలా పెద్దమనిషి,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తి,  ఇక నారా లోకేష్ నేను మంచి మిత్రులం. కానీ అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనేది నేను క్లారిటీగా చెప్పలేను. టఫ్ ఫైట్ అయితే నడుస్తోందని  అన్నారు. పాలకులు బాగుంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారని ఎవరు గెలిచినా కానీ  పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని తెలియజేశారు. ఎవరు గెలిచినా కానీ ప్రజాభివృద్ధి కోసం పాటుపడాలని  ఆయన తెలియజేశారు. ప్రస్తుతం కేటీఆర్ ఈ విధమైన కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: