ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఊహించని దెబ్బ తగిలిందనే చెప్పాలి. సరిగ్గా పోలింగ్ కు ఇంకా నెలరోజులు టైం మాత్రమే ఉన్న నేపథ్యంలో.. ఆంధ్ర ప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీకి ఊహించని విధంగా షాక్ అనేది తగిలింది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్లు ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది. దీంతో ఈ ఘటన ఆ పార్టీకి బిగ్ షాక్ అని అంటున్నారు. ఇంకో నెల రోజుల్లో  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న లోక్ సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి.  ఏపీలో అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా.. టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిగా రంగలోకి అడుగుపెడుతున్నాయి. ఈ కీలక సమయంలో... జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయ్యిందనే విషయం బాగా వైరల్ గా మారింది.


జనసేన పార్టీ అధికార యూట్యూబ్ ఛానల్ కి సుమారు 1.4 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉండగా.. అందులో ఏకంగా ఐదున్నర వేల వీడియోలు ఉండేవి.  పార్టీ కార్యక్రమాలు, పవన్ ప్రసంగాలు, వారాహి యాత్రలను ఆ ఛానల్ లో లైవ్ టెలీకాస్ట్ చేసేవారు. ఇక ఆ ఛానల్ ని హ్యాక్ చేసిన హ్యాకర్లు.. దాని పేరును మైక్రోస్ట్రాటజీగా మార్చడం జరిగింది. ప్రస్తుతం ఆ హ్యాక్ చేయబడిన ఛానల్ లో యూట్యూబ్ బ్యాన్ చేసిన బిట్ కాయిన్ గురించిన కొన్ని లైవ్ వీడియోలు కూడా ప్రారంభించడం జరిగింది.దీంతో... ఈ విషయం యూట్యూబ్ దృష్టికి వస్తే చానల్ ని పూర్తిగా బ్యాన్ చేసే ఛాన్స్ ఉందని ఇండియా హెరాల్డ్ టీం కి సమాచారం తెలిసింది. అయితే ఈ లోపు జనసేన పార్టీకి చెందిన టెక్నికల్ టీం.. యూట్యూబ్ సంస్థ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తే ఛానల్ ని మళ్ళీ పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోందని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కు ఇంకా జనసేన అభిమానులకు తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎన్నికల వేళ ఇలా జరగడం నిజంగా జనసేన పార్టీకి షాకింగ్ విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: