ఉమ్మడి కృష్ణాజిల్లాలో పెనమలూరు నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గానికి ప్రస్తుతం కొత్త నాయకులు పోటీ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. టిడిపి నుంచి బోడే ప్రసాద్ పోటీ చేస్తూ ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి జోగి రమేష్ పోటీ చేస్తున్నారు. మరి ఇద్దరు బిగ్ నేతల మధ్య జరుగుతున్న ఈ వార్ లో పై చేయి సాధించేది ఎవరు.? ప్లస్ లు..మైనస్లు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం..

 మూడుముక్కలాటలో జోగి :
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్నారు జోగి రమేష్. గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి ఈయన భారీ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత జగన్ క్యాబినెట్ లో మంత్రిగా పదవి అలంకరించారు. కానీ ఆయనకు ఆ జిల్లా మొత్తం వ్యతిరేకత ఏర్పడిందట. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో వెనుకబడిపోయారనే టాక్ వినిపించింది. దీంతో ఆయనను ఆ నియోజకవర్గంలో నుంచి తప్పించి పెనమలూరు పంపించారనేది టాక్. నిజానికి జోగి రమేష్ స్వస్థలం ఇబ్రహీంపట్నం ఇది మైలవరం నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. కానీ 2009 అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన పెడన నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. 2014లో మైలవరం బరిలో నుంచి దిగి ఓడిపోయారు. దీంతో ఆ స్థానంలో వసంత కృష్ణ ప్రసాద్ ను నిలిపింది. ఆ తర్వాత 2019లో పెడన నుంచి పోటీ చేసిన జోగి విజయాన్ని అందుకున్నారు. ఈ విధంగా కృష్ణాజిల్లాలోనే అన్ని నియోజకవర్గాల్లో జోగి రమేష్ జోక్యం చేసుకోవడంతో అక్కడ వైసిపి కేడర్ కు అస్సలు నచ్చలేదు. ఆయన ఏదో ఒక స్థానంలో ఉండకుండా అన్ని స్థానాలను గెలుకుతున్నారని దీనివల్ల మిగతా నేతలందరికీ మింగుడు పడడం లేదు. దీంతో కృష్ణాజిల్లాలోనే జోగి రమేష్ కు వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. ఇదే తరుణంలో పెడనలో వ్యతిరేక వర్గాలు ఉన్నాయని ఆయనను పెనమలూరు పంపించారు. ఇక్కడ కూడా ఆయనకు ఎదురు దెబ్బలే తగులుతున్నట్టు తెలుస్తోంది.

 వైసిపికి ఎదురు దెబ్బ:

ఈ నియోజకవర్గం 2009 ఎన్నికలకు ముందే ఏర్పడింది. 2009, 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పార్థసారథి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2014లో బోడే ప్రసాద్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి బోడే ప్రసాద్ మరోసారి టిడిపి అవకాశం కల్పిస్తుంది. ఇదే తరుణంలో టిడిపి ప్లాన్ చేసి పార్థసారధిని తమ పార్టీలో విలీనం చేసుకుంది. అంతేకాకుండా పెనమలూరులో వైసీపీ సీనియర్ నాయకుడు తనకు టికెట్ వస్తుందని భావించినటువంటి పడమటి సురేష్ బాబుకు వైసిపి టికెట్ ఇవ్వకుండా, జోగి రమేష్ కు ఇవ్వడంతో ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ విధంగా పెనమనులూలో వైసిపిలో ఉన్నటువంటి బిగ్ లీడర్లు సైడ్ అవుతుండడంతో వారి కేడర్ కూడా కన్ఫ్యూజన్ లో ఉంది. ఇదే తరుణంలోనే కొత్త అభ్యర్థిగా జోగి రమేష్ రావడంతో అక్కడి కార్యకర్తలతో అంతగా పోసగలేకపోతున్నారట. దీంతో వైసిపి పార్టీలో నైరాశ్యం నెలకొంది. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే బోడె రమేష్ ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ప్రచారాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు. ఈయనకు తోడుగా పార్థసారధి కూడా సపోర్ట్ అందించడంతో వైసీపీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. మరి ఈ ఉత్కంఠ పోరులో టిడిపికి మద్దతు లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో జోగి రమేష్ సురేష్ బాబును కలుపుకొని ప్రచారం చేసినా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: