ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల జోరు రసవత్తరంగా సాగుతోంది.. నిజానికి ఆంధ్రప్రదేశ్లో బిజెపి ప్రభావం పెద్దగా లేకపోయినా పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడం వెనుక చాలా రాజకీయ వ్యూహమే దాగి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ పార్టీ సింగిల్ గా పోటీకి దిగుతుంటే టిడిపి మాత్రం జనసేన, బిజెపి లతో పొత్తు కలుపుకొని ముందుకు వెళ్తోంది.. అయితే ఇక్కడ టిడిపి, జనసేనతో బిజెపి కలవడం వెనుక పెద్ద రాజకీయ హస్తం ఉంది అంటూ తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది.. అసలు విషయంలోకి వెళ్తే.. ఏపీలో బిజెపికి పెద్దగా ఆశలు లేవు.. ఇక్కడ గెలిచినా సరే తక్కువ సీట్లే లభిస్తాయని పెద్దలకు ముందే తెలుసు.

ఇక పొత్తులో భాగంగా కొన్ని స్థానాలనే తీసుకొని పోటీ చేయడం వెనుక కారణం ఇదే అన్నట్టుగా ఆ పార్టీ వైఖరి అనిపిస్తోంది.. అయితే ఇప్పుడు టిడిపి , జనసేన క్రేజ్ ను ఉపయోగించుకొని మిగతా రాష్ట్రాలలో బిజెపి ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ మేరకు టిడిపి,  జనసేన పార్టీలోని ముఖ్య నాయకులతో బిజెపి ఇతర రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం చేయించాలని నిర్ణయించింది.. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.  అందులో భాగంగానే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై కోసం రెండు రోజులు కోయంబత్తూర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించేలా బిజెపి ప్లాన్ చేసుకుంది. ఏపీ సరిహద్దు ప్రాంతాలలో పవన్తో ప్రచారం చేయించేందుకు బిజెపి సిద్ధం అవుతుంది.. ఇందులో భాగంగానే తమిళ ఓటర్ల ప్రభావం ఉన్న నగరి వంటి చోట్ల అన్నామలై తో ప్రచారం చేస్తే ప్రయోజనం ఉంటుందని బిజెపి పెద్దలు భావిస్తున్నారట.. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 16వ తేదీన పవన్ కళ్యాణ్  సెంట్రల్ చెన్నైలో ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. మరి పవన్ కళ్యాణ్ ప్రచారం బిజెపికి ఏం మేరకు కలిసొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: