సీఎం జ‌గ‌న్‌పై కొన్ని రోజుల కింద‌ట అనంత‌పురంలో చెప్పులు ప‌డిన విష‌యం క‌ల‌క‌లం రేపింది. అక్క‌డ కూడా.. బ‌స్సు యాత్ర‌ను ల‌క్ష్యం చేసుకునే ఆగంత‌కులు చెప్పులు విసిరారు. అయితే.. అవి తృటిలో త‌ప్పి.. భ‌ద్ర‌తా సిబ్బందికి త‌గిలాయి. ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడే.. డీజీపీ చ‌ర్య‌లు తీసుకునే ప్ర‌య‌త్నం చేసిన ఉంటే.. ఇప్పుడు రాయి ప‌డిన ఘ‌ట‌న జ‌రిగి ఉండేది కాదు. కానీ, ఏం జ‌రిగిందే. ఏమ‌నుకున్నారో.. అస‌లు చెప్పుల ఘ‌ట‌న‌పై అంద‌రూ మౌనం వ‌హించారు.


మ‌రి ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలోనో.. లేక ఏం చేసినా.. ఫ‌ర్వాలేద‌నుకున్నారో.. తెలియ‌దు కానీ.. ఇప్పుడు ఏకం గా రాళ్లు ప‌డ్డాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. వాస్త‌వానికి సీఎం జ‌గ‌న్ స్థాయి వ్య‌క్తుల వ‌ద్ద‌కు వెళ్లేందుకు సాధార‌ణ పౌరుల‌కు అనుమ‌తి రావ‌డం చాలా క‌ష్టం. అయితే.. జ‌న‌నేత‌గా పేరు తెచ్చుకున్న జ‌గ‌న్ స్వ‌యంగా తానే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. ఎలాంటి భ‌ద్ర‌తా అవ‌స‌రం లేదన్న‌ట్టుగానే ముందుకు సాగుతున్నారు. ఇది ఒక విధంగా దాడులు చేయాల‌ని అనుకున్న వారికి అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింది.


ప్ర‌స్తుతం జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఒక‌టి జ‌గ‌న్ అంటే గిట్ట‌నివారైనా చేసి ఉండాలి. లేక‌.. ప్ర‌జ‌ల్లోనే వ్య‌తిరేక‌త‌కు దీనిని ప్ర‌తిబింబింగా అయినా చూడాల్సి ఉంటుంది. అయితే.. ప్ర‌జాగ్ర‌హ‌మే నిజ‌మ‌ని అనుకుంటే.. కేవ‌లం ఒక‌టి రెండు ప్రాంతాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుందా? అనేది కూడా చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్న జ‌గ‌న్‌కు అన్ని చోట్లా ప్ర‌జ‌లు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఎన్నిక‌ల వేళ ఎలాంటి తీర్పు ఇస్తార‌నేది ఎలా ఉన్నా.. ఇప్ప‌టికైతే సానుకూలంగా ఉన్నారు.


ఇక‌, జ‌గ‌న్ అంటే గిట్ట‌నివారే ఈ ప‌నిచేశార‌ని అనుకున్నా.. అస‌లు అంత పెద్ద ఎత్తున భ‌ద్ర‌త క‌ల్పించిం ది ఇలాంటి వారిని గుర్తించేందుకే క‌దా!  ఈ విష‌యంలో పోలీసులు ఎందుకు ఇంత ఉదాసీనతగా ఉన్నార‌నేది ప్ర‌శ్న‌. మొన్న చెప్పులు.. నేడు రాళ్లు ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మున్ముందు ఏం జ‌రిగినా.. ప్ర‌శ్నించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు సాధ్య‌మైనంత వ‌ర‌కు ఈ విష‌యంలో ఏం జ‌రిగింద‌నేది తేలితేనే.. ఇటు ప్ర‌భుత్వానికి.. అటు రాజ‌కీయాల‌కు కూడా మంచిద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: