దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఒక్క ఏపీలోనే కాదు. అయితే.. ఏపీలో జ‌రుగుతున్న ప‌రిస్థితు లు దేశంలో ఎక్క‌డా లేవ‌నే టాక్ వినిపిస్తోంది. ఏపీలోనే విప‌క్షాలు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌ని అనుకుం టే పొర‌పాటే. ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు, అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఇంత‌క‌న్నా ఎక్కువ‌గానే ప్ర‌తిప‌క్షాలు-అధికార పార్టీ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోంది. మాట‌ల తూటాలు పేలు తున్నాయి. కానీ, దాడులు మాత్రం ఎక్క‌డా రిపోర్టు కావ‌డం లేదు.


దీనికి కార‌ణం. ఆయా రాష్ట్రాల్లో ప‌క్కాగా పోలీసింగ్ జ‌రుగుతోంది. కానీ, ఏపీ విష‌యానికి వ‌స్తే మాత్రం తేడా కొడుతోంది. ఇక్క‌డ ఏం జ‌రుగుతోందో స్థానికంగా ఉన్న‌వారికి కూడా అర్ధం కావ‌డం లేదు. దీనిపై ఇండియా హెరాల్డ్ మీడియా సంస్థ కొన్ని డౌట్లు కూడా వ్య‌క్తం చేస్తోంది. ఏపీ లో పోలీసులు వ్య‌వ హ‌రిస్తున్న తీరు అనేక అనుమానాల‌కు తావిస్తోంది. విప‌క్షాల‌ను క‌ట్టడి చేసేందుకు పోలీసు యాప్‌ను అడ్డు కున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. కీల‌క‌మైన ఎన్నిక‌ల నామినేష‌న్ల ప్ర‌క్రియ స‌మ‌యంలో విప‌క్ష నేత‌ల‌పై ఉన్న కేసుల వివ‌రాలు ఇవ్వ‌డం లేద‌నే విష‌యం తెలిసిందే.


ఇక‌, ఇప్పుడు ఏకంగా సీఎం జ‌గ‌న్‌పై నే రాయి దాడి జ‌రిగింది. మ‌రి వీటిని ఏ కోణంలో చూడాలి?  ఎలా అర్దం చేసుకోవాల‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అంద‌రూ సీఎం కు అనుకూల‌మ‌ని టీడీపీ చెబుతోంది. అలాంట‌ప్పుడు.. సీఎంపైనే దాడి జ‌రిగితే.. క‌నీసం డీజీపీ మీడియా ముందుకు రాలేక పోయారు. ఖండిం చ‌డ‌మో.. త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌డ‌మో చేయాలి. అది కూడా ఆయ‌న చేయ‌లేక పోయారు. దీనిని బ‌ట్టి.. నేత‌ల భ‌ద్రత ఎలా ఉంటుంద‌నే ప్రశ్న తెర‌మీదికి వ‌స్తోంది.


నిజానికి రాష్ట్రం జెడ్‌+ కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో చంద్ర‌బాబు ఉన్నారు. ఆయ‌న‌కుమారుడు నారా లోకేష్కు ఇటీవ‌లే జెడ్ భ‌ద్ర‌త క‌ల్పించారు. వీరు త‌ప్ప‌.. మిగిలిన‌వారంతా .. సాధార‌ణ బ‌ద్ర‌తా ప‌రిధిలోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మిగిలిన వారి ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న వ్యాఖ్య‌లు కూడా భ‌ద్ర‌త లోపాన్ని చెబుతున్నాయి. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేమంటూ.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖుల భ‌ద్ర‌త విష‌యంలో ఏపీ పోలీస్ ఉదాసీన‌త ప‌నికిరాద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: