ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలకంగా మారిన నియోజకవర్గం జగ్గయ్యపేట. ఈ నియోజకవర్గంలో ప్రజలు చాలా అప్డేట్ గా ఉంటారు. పార్టీలను చూడకుండా వారికి ఏ అభ్యర్థి బాగు చేస్తాడనేది గమనించి మరీ గెలిపిస్తారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడం వల్ల ఇది కమర్షియల్ ఏరియాగా మారిపోయింది. అలాంటి జగ్గయ్యపేటలో ఆ ఒక్క సెంటిమెంటు ఎప్పుడు వర్కవుట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఈసారి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే తప్పనిసరిగా వైసిపిదే విజయం అని అంటున్నారు. మరి అది వర్కఔట్ అవుతుందా లేదంటే బెడిసి కొడుతుందా అనే వివరాలు చూద్దాం..

జగ్గయ్యపేట నుంచి వైసిపి అభ్యర్థిగా సామినేని ఉదయభాను పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి శ్రీరామ్ రాజగోపాల్  బరిలో ఉన్నారు. మరి అలాంటి వీరిద్దరిలో  ఎవరు గెలుపు తీరాలకు వెళ్తుంది అనే వివరాలు  చూద్దాం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో బీసీలు 60వేలు, కమ్మ 45వేలు, కాపు 25వేలు, ఎస్సీ 20వేలు, ఆర్యవైశ్య 18 వేల ఓట్లు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు  సామినేని ఉదయభాను  వరుసగా 1999, 2004లో గెలిచారు. ఆ తర్వాత 2009, 2014లో శ్రీరాం రాజగోపాల్ కి  అవకాశం ఇచ్చారు. ఈ విధంగా ఆ నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే ఒక అభ్యర్థికి రెండుసార్లు అవకాశం తప్పనిసరిగా వస్తుంది. సెంటిమెంట్ ప్రకారం చూస్తే మాత్రం ..ఆ నియోజకవర్గంలో సామినేని ఉదయభాను మరోసారి విజయం సాధించాలి.

కానీ ఆయన 2019 విజయం తర్వాత  నియోజకవర్గాన్ని అంతగా అభివృద్ధి చేయలేదని,  ప్రజలకు అందుబాటులో లేడని ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అంతేకాకుండా అక్కడ  సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నా కానీ అక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆయన విఫలమయ్యారని  తెలుస్తోంది. ఇదే తరుణంలో ఉదయభాను మాత్రం  జగన్ చేసిన అభివృద్ధి పనులను  వివరిస్తూ, మైనారిటీ వర్గ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే టిడిపి, బిజెపితో జత కట్టింది కాబట్టి  ముస్లిం మైనారిటీ ఓట్లు బిజెపికి పార్టీ వైపు తక్కువగా పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ముస్లిం ఓట్లు ఎక్కువగా వైసీపీకి పడే అవకాశం ఉంది.

ఈ విధంగా జగ్గయ్యపేటలో ఈ ఇద్దరు నేతలు సమానమైన రేంజ్ లో ఉన్నారు. ఎవరు గెలుస్తారు అని చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక సెంటిమెంట్ ప్రకారం చూస్తే 2019లో గెలిచినటువంటి వైసీపీ అభ్యర్థి ఉదయభాను మరోసారి గెలుస్తారని అంటున్నారు. అంతేకాకుండా ఈసారి గెలిస్తే తప్పకుండా ఆయనకు క్యాబినెట్ మంత్రి పదవి వస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఈ విధంగా ఇద్దరు నేతలు హోరాహోరీగా తలపడుతున్న ఈ తరుణంలో ఎవరు గెలుస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: