ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల ప్రచారం రోజురోజుకీ ఉధృత అవుతోంది. అన్ని పార్టీలు కథనరంగంలోకి సైతం దూసుకుపోతున్నాయి. దీంతో అవసరమైన అస్త్ర శస్త్రాలను కూడా రాజకీయ నాయకులు ప్రచారం కార్యక్రమాలలో భాగంగా ఉపయోగిస్తూ దూసుకుపోతున్నారు.. పోలింగ్ గడువు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వేలు మరొకసారి జోరు అందుకుంటున్నాయి.. రాష్ట్ర జాతీయస్థాయిలో అన్ని సర్వేలు కూడా ఏపీ ఎన్నికల పైన తమ సర్వేలను సైతం తెలియజేస్తూ ఉన్నాయి.


అభ్యర్థుల మొదటి జాబితా విడుదలను మొదలుకొని ప్రచార కార్యక్రమాలు.. వారికి వస్తున్న ఆదరణ జనాదరణను చూసి అభ్యర్థుల గెలుపోటములపైన సర్వేలు సైతం తెలియజేస్తూ ఉంటాయి.. ఇప్పటివరకు చాలా సర్వేలు అధికార పార్టీ వైసిపి వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఫోన్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన తాజా సర్వే ను సైతం నిర్వహించింది. ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహించగా దాదాపుగా..1,48,532 మంది ఓటర్ల అభిప్రాయంతో ఈ సర్వేను విడుదల చేశారట.


సర్వే తెలిపిన ప్రకారం మరొకసారి ఆంధ్రాలో వైసీపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని.. అది కూడా 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు వస్తాయని.. లోక్సభలో 19 నుంచి 21 స్థానాలు గెలుచుకుంటుందంటూ తెలియజేశారు. టిడిపి, జనసేన , బిజెపి కూటమిలో భాగంగా.. 45 నుంచి 55 స్థానాలు దక్కుతాయని వెల్లడించారు. అలాగే లోక్సభ విషయానికి వస్తే.. 4 నుంచి 6 సీట్లు వస్తాయని సర్వే తెలియజేసింది.. అయితే వైసీపీ పార్టీకి పోలయ్యే ఓట్ల శాతం 50 నుంచి 52% వరకు ఉంటుందని.. పురుషులు 48 శాతం వైసీపీ వైపు.. 55% మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.. టిడిపి పార్టీకి 46% వరకు ఉంటుందట.. అయితే ఇందులో పురుషులు 47% మహిళలు 40 శాతం వరకు కూటమికి ఓటు వేస్తారని తెలిపారు. ఇతరులలో 0.5 శాతం మంది ఓటు పడే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు.జగన్ పైన రాళ్ల ఎటాక్ తర్వాత తాజా సర్వే లెక్కల ప్రకారం లెక్కలు మారినట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: