దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామ చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆప్ పార్టీలోని కీలక నేతలతో పాటు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంలో రాజకీయపరమైన చర్చ పీక్స్ కి చేరింది. పైగా.. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది.


ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అవ్వడం తెలిసిందే. తన చిన్న కుమారుడు పరీక్ష రిత్యా మధ్యంతర బెయిల్ కు దరఖాస్తు చేసినా కోర్టు ఆ పిటిషన్ ను కొట్టి వేసింది. మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది. ఈ సమయంలో సీబీఐ మరో బాంబ్ పేల్చింది. ఈ కేసు విషయమై సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.


ఇంత వరకు బాగానే ఉన్నా ఈ కేసులో ఇప్పటి వరకు సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేదన్న ఒక ప్రశ్న అందరిలో మెదులుతుంది. అయితే ఈ అరెస్ట్ వ్యవహారాన్ని ముందే పసిగట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీబీఐను రాష్ట్రంలోకి రాకుండా బ్యాన్ చేశారు. సీబీఐ అధికారులు తెలంగాణలో ఎవర్ని అయినా విచారించాలంటే తెలంగాణ ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.


ఈ కారణం చేత ఇన్ని రోజులు సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు సీబీఐ విచారణ విషయమై రాష్ట్ర గవర్నర్ కు ముందే సమాచారం వస్తుంది. ఒకవేళ గవర్నర్ ఫోన్ ట్యాప్ చేసి కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వ్యూహాత్మకంగానే రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా అడ్డుకున్నారనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా కవితను కాపాడిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం నిస్సహాయంగా ఉన్నారు. కనీసం దీనిపై స్పందించలేకపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: