తాను చంద్ర‌బాబు స్థాపించిన సైబ‌రాబాద్‌లో పెరిగిన మొక్క‌ను సార్ అని వీరావేశంతో చంద్ర‌బాబు ముందు డైలాగులు చెప్పిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఎన్నిక‌ల‌కు ముందు కేవ‌లం చంద్ర‌బాబు సీటు ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యే అయ్యి ఏకంగా మంత్రి అయ్యారు. జ‌గ‌న్‌ను రాక్ష‌సుడితో పోల్చిన ర‌జ‌నీ అదే జ‌గ‌న్‌ను దేవుడు అని.. చంద్ర‌బాబును దారుణంగా తిట్టిపోశారు. అయితే ఇప్పుడు ర‌జ‌నీ ఇంటిగుట్టు మొత్తం గుంటూరోళ్ల‌కు చెప్పేలా చంద్ర‌బాబు స్కెచ్ గీశారు.

అస‌లు విష‌యంలోకి వెళితే గ‌త ఎన్నిక‌ల్లో చిల‌క‌లూరిపేట నుంచి గెలిచిన ర‌జ‌నీ మంత్రి కూడా అయ్యారు. ఆమె ఈ సారి అక్క‌డ గెల‌వ‌ద‌ని తేల‌డంతో జ‌గ‌న్ గుంటూరు వెస్ట్‌కు మార్చారు. ఆమెను వెస్ట్‌కు మార్చిన‌ప్పుడు ఆమె కుటుంబ బంధువు మ‌ల్లెల రాజేష్ నాయుడుకు చిల‌క‌లూరిపేట సీటు ఇప్పించుకున్నారు. ఇది పైకి బాగానే జ‌రిగింది. అయితే దీని వెన‌క ర‌జ‌నీ ఏకంగా రు 6.5 కోట్లు తీసుకున్నార‌న్న విష‌యం ర‌జ‌నీకి, రాజేష్‌కు చెడ్డాక కాని బ‌య‌ట‌కు రాలేదు.

పేట సీటు ఇప్పించేందుకు విడదల రజనీ తన వద్ద ఆరున్నర కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపించిన లీడర్ ఆ త‌ర్వాత ఆమెతో విబేధించి బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీలో చేరారు. ఇప్ప‌టికే చిల‌క‌లూరిపేట‌లో టీడీపీ కోసం ఆయ‌న వ‌ర్గం ప‌నిచేస్తోంది. అయితే ఇప్పుడు చంద్ర‌బాబు ర‌జ‌నీ గుట్టు అంతా రాజేష్ ద్వారా గుంటూరులో బ‌య‌ట పెట్టించే స్కెచ్ గీశారు. గుంటూరు వెస్ట్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడిగా రాజేష్ నాయుడును చంద్ర‌బాబు నియ‌మించారు.

ఇప్పుడు రాజేష్ నాయుడు గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం తిరిగి రజనీ చిలుకలూరిపేటలో చేసిన నిర్వాకాల గురించి మొత్తం చెబుతానని అంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ర‌జ‌నీతో తిరిగిన వ్య‌క్తి.. పైగా వాళ్ల‌కు బంధువు అయిన రాజేష్ ర‌జ‌నీ త‌న‌నే ఎలా మోసం చేసిందో చెప్ప‌డంతో పాటు ఇప్పుడు ఆమె సొంత ఇళ్లు లాంటి చిల‌క‌లూరిపేట‌లో ఆమె సీక్రెట్లు అన్నీ రాజేష్ గుంటూరు వెస్ట్ జ‌నాల ముందు బ‌య‌ట పెట్ట‌నున్నారు. రాజ‌కీయంగా ఆమె చేసిన త‌ప్పులు అన్నీ బ‌య‌ట‌కు వ‌స్తే అది ఇక్క‌డ ఖ‌చ్చితంగా టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది.

ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గళ్లా మాధవి పోటీ చేస్తున్నారు. ఆమె పద్దతిగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్ప‌టికే చాలా సాఫ్ట్ కార్న‌ర్ ముద్ర మాధ‌వికి వ‌చ్చేసింది. పైగా మాధవి లోక‌ల్ కావ‌డంతో పాటు ఆమె కోసం టీడీపీ కేడ‌ర్ అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ప‌ని చేస్తున్నారు. ఇప్పుడు రాజేష్ నాయుడు రూపంలో ఆమెకు మ‌రి కొంత స‌పోర్ట్ ప్ల‌స్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: