ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సమయం మరింత దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలలో రోజురోజుకి ఎలా మలుపు తిరుగుతున్నాయో చెప్పడం కష్టంగా మారుతోంది... అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో పాటు రాళ్ల యుద్ధం కూడా జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలలో  చాలా మంది నేతలు కూడా వలసల సంఖ్య కొనసాగుతూనే ఉన్నది.. కొంత మంది రాజీనామాలు చేసి మరో పార్టీలో చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా అధికార ,ప్రతిపక్షాలు అని తేడా లేకుండా కూడా ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉన్నాయి.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పలాసలో అధికారికంగా వైఎస్ఆర్సిపి పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ వైసీపీకి బై బై చెప్పినట్టుగా తెలుస్తోంది.


ఈయన బాటలోనే ఈయన భార్య రాష్ట్ర కళింగ కార్పోరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ కూడా గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తోంది. వైయస్సార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా పదవులకు కూడా రాజీనామా చేసినట్లుగా ఇరువురు తెలియజేశారు. దాదాపుగా వైసిపి పార్టీకి 11 ఏళ్లుగా సేవలు అందించినప్పటికీ తమకు తగిన గుర్తింపు రాలేదని దువ్వాడ శ్రీకాంత్ రాజీనామా చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. పార్టీలో కొన్ని అంతర్గత విభేదాల వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. గడిచిన కొన్నేళ్లుగా పార్టీలో తనకు ఎక్కువగా అవమానాలు జరిగాయి అంటూ వాటిని తట్టుకోలేకనే వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలియజేశారు.


రాజీనామా చేసిన వెంటనే.. టిడిపి పార్టీలోకి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేపట్టిన యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు మీడియా సమావేశంగా తెలియజేశారు దువ్వాడ శ్రీకాంత్.. మరి శ్రీకాంత్ వైసీపీకి రాజీనామా చేయడంతో అక్కడ టిడిపి నేతలు బలం పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరింత మంది నేతలు ఏ పార్టీలోకి చేరుతారనే విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: