ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ లోక్సభ స్థానాలకు మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీల సైతం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. కూటమిలో భాగంగా టిడిపి , జనసేన, బిజెపి నేతలందరూ కూడా ప్రజల వద్దకు వెళ్తున్నారు కానీ వైసీపీ పార్టీ మాత్రం ఒంటరిగానే ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ఇరువురు పార్టీలకు మేనిఫెస్టో చాలా కీలకమైంది. ఇదే పార్టీల గెలుపోవటములను కూడా నిర్ణయించేది.. గత ఎన్నికలలో వైసీపీ పార్టీ నవరత్నాల పేరుతో మేనిఫెస్టోని విడుదల చేశారు. సంక్షేమ పథకాలే జగన్ కి అధికారం తీసుకువచ్చేలా చేశాయని కూడా చెప్పవచ్చు.


2014లో చంద్రబాబు 650 హామీలతో చంద్రబాబు మేనిఫెస్టోని విడుదల చేశారు. ముఖ్యంగా ఇందులో రైతుల రుణమాఫీ , డాక్రా రుణమాఫీ చేయకపోవడంతో 2019లో చాలా ఘోరంగా ఓడిపోయారు. కానీ 2019లో జగన్ చెప్పిన హామీలను 98% నెరవేర్చినట్టుగా ఇప్పటికీ ఎన్నోసార్లు చెబుతూ ఉన్నారు. తను చెప్పిన పని చేసి ఉంటేనే ఓటు వేయమని అభ్యర్థులను కూడా అడుగుతున్నారు. ఇక చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ హామీ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించారు. అయితే మళ్లీ కొన్ని కారణాల చేత వాటిని రద్దు చేసి త్వరలోనే కూటమి మేనిఫెస్టోని ప్రకటిస్తామంటూ తెలియజేశారు.


కూటమి మేనిఫెస్టో గురించి ఇప్పటివరకు అదిగో ఇదిగో అని చెబుతున్నారు తప్ప ప్రకటించడానికి ధైర్యం చాలడం లేదు కూటమికి అనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ మేనిఫెస్టో కోసమే కూటమి ఎదురుచూస్తోందని.. ముఖ్యంగా జగన్ ఎలాంటి అంశాలతో ప్రజలలోకి వెళ్తారు.. ఆ మేనిఫెస్టోను బట్టే తమ మేనిఫెస్టో ప్రకటించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా సమాచారం.. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఎక్కడా కూడా మేనిఫెస్టో గురించి లీక్ ఇవ్వడం లేదు. దీంతో ఒక్కసారిగా కూటమిలో మేనిఫెస్టో భయపెడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులు , డ్వాక్రా మహిళల కు , రుణమాఫీ చేస్తారని ప్రచారం అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ పార్టీ నుంచి వినిపిస్తోంది. పార్టీ నేతలు కూడా ఈ రెండు పథకాల మీదే జగన్ ను  ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నారట.. ఒకవేళ ఇది ఓకే అయితే కచ్చితంగా గెలవడం ఖాయమని చెప్పవచ్చు.


ఓటర్లు కూడా ఎక్కువగా రైతులు,  మహిళలే ఉండడం చేత వైసిపి మేనిఫెస్టోలో ఈ రెండు అంశాలు కీలకమైనవి.. మరి ఈ మేనిఫెస్టో ని కూటమి ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: