ప్రతి ఏడాది సమ్మర్ సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఐపిఎల్ సీజన్ వచ్చినప్పటికీ ఎంతో కొంత ప్రభావం అయితే చూపుతూ ఉంటుంది కానీ ఈసారి ఇది చాలదు అన్నట్లు పొలిటికల్ హీట్ కూడా సినిమాల పైన భారీగానే దెబ్బ పడేలా కనిపిస్తోంది.. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి.. మరో నెల రోజులలో ఈ ఎన్నికలు జరగబోతున్న సమయంలో.. రాజకీయ నాయకులు ఎక్కువగా వీటి మీద ఫోకస్ పెట్టి ప్రజలలో మమేకమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.


కానీ ఇక్కడ ఏపీ రాజకీయాలు సినిమాలను మించి మరీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయని చెప్పవచ్చు. కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ మీద దాడి జరగడంతో ఒకసారిగా ఈ విషయం ఆంధ్రాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పైన గత కొద్దిరోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఈ పని ప్రత్యర్థులు చేశారనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. మరి కొంతమంది టీడీపీ నేతలు సింపతి కోసమే వైసీపీ నేతలు చేయించారంటూ ఆరోపణలు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత పవన్,  చంద్రబాబు పైన కూడా రాళ్లు విసరడంతో ఇది వైసిపి వారు చేసిన పనే అంటూ కూడా తెలిపారు.


టిడిపి నేతలు ఇది కోడి కత్తి డ్రామా అంటూ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఈ గాయం పైన అటు పవన్ కళ్యాణ్ , చంద్రబాబు ఇద్దరు కూడా రాజకీయాల మీటింగ్లలో స్పందించడంతో చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు ప్రముఖ టిడిపి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి కూడా ఒక బ్యాండేజ్ ను చుట్టుకొచ్చి చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఒకడు తనని కొట్టాడని ఎలాగైనా గెలిపించాలంటూ మీడియా ముందు చేసిన ఒక స్టంట్ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అలాగే షర్మిల,  సునీత వివేక హత్య విషయాన్ని కూడా ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లి వైసిపిని గెలవకుండా చేయాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం పలు విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయం తో పోలిస్తే సినిమా వినోదం ఒక జుజుబి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: