ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పామర్రు కూడా ఒకటి. కృష్ణాజిల్లాలోనే ఈ నియోజకవర్గం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి ఈ నియోజకవర్గం  ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి ఒక్కసారిగా కూడా టిడిపి బోని కొట్టలేదు. అయితే ఈసారైనా  బోని కొట్టాలని  గట్టి ప్రయత్నం చేస్తోంది. కానీ వైసిపి, టిడిపి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ  ఈ నియోజకవర్గంలో పాగా వేసింది. మరోసారి గెలిచి హైట్రిక్ సాధించాలని చూస్తోంది. ఈ విధంగా ఇద్దరు బలమైన నేతల మధ్య ఇక్కడి రిజల్ట్ ను అంచనా వేయడం రాజకీయ  విశ్లేషకులకు కూడా అంతుపట్టడం లేదు. ఈసారి పామర్రు నియోజకవర్గం నుంచి  టిడిపి తరఫున  వర్ల కుమార రాజా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కైలే అనిల్ పోటీ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరి పోటీలో  గెలుపు ఎవరిని వరిస్తుందో ఇప్పుడు చూద్దాం.. 

 ఈ నియోజకవర్గంలో మొత్తం 1,80,900ఓట్లు ఉన్నాయి.ఇందులో పురుషులు 88వేలు ఉండగా, స్త్రీలు 92వేలు ఉన్నారు. అలాంటి ఈ నియోజకవర్గంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో  ఉప్పులేటి కల్పన అప్పటి టిడిపి అభ్యర్థి రామయ్యపై  భారీ మెజారిటీతో గెలుపొందింది. ఆ తర్వాత 2016లో ఆమె టిడిపి తీర్థం పుచ్చుకుంది. దీంతో 2019లో ఈ సీట్ ను కైలా అనిల్ కుమార్ కు కేటాయించింది వైసీపీ. ఈసారి తనకు టిడిపి టికెట్ వస్తుందని ఆశించింది కానీ అనూహ్యంగా  ఈ టికెట్ ను రామయ్య కుమారుడు  కుమార్ రాజాకు కేటాయించారు.

 బలబలాలు:
 2014, 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని  బలమైన అంశం ప్రజల్లోకి వచ్చింది. ముఖ్యంగా పామర్రులో బస్టాండ్, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇసుక ప్రజలకు అందుబాటులో లేకుండా ధరలు పెరిగాయని  ఆరోపణ ఉంది. మరోవైపు జగన్ పథకాలు ఎక్కువగా నియోజకవర్గానికి అందాయి. పథకాల గురించి వివరిస్తూ  మరోసారి కైలా అనిల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక టిడిపి నుంచి పోటీ చేసే  కుమార రాజా ప్రస్తుతం అక్కడ టిడిపి ఇన్చార్జిగా ఉన్నారు. దీంతో అధిష్టానం ఆయనకి టికెట్ ఇచ్చింది. ఇప్పటికే చాలాసార్లు ఓటమిపాలైన టిడిపికి ఈసారి చాన్స్ ఇద్దామనే ఆలోచన ప్రజల్లో బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వైసిపి చేసినటువంటి  వైఫల్యాలను కూడా వర్ల కుమార రాజా బయట పెడుతూ దూసుకుపోతున్నారు. కానీ వర్లకు కల్పన సపోర్టు దొరికితే మాత్రం విజయ తీరాలకు వెళ్లి అవకాశం ఉందని తెలుస్తోంది. మరి చూడాలి పామర్రు ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటారా లేదంటే మరోసారి వైసీపీకే అధికారం కట్టబెడతారా అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: